David Warner ODI Retirement: న్యూఇయర్ రోజే ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్(David Warner) ఫ్యాన్స్ కు షాకిచ్చాడు. ఇటీవల టెస్టుల కెరీర్ కు వీడ్కోలు పలికిన వార్నర్.. తాజాగా వన్డేలకు గుడ్ బై చెప్పాడు. కేవలం టీ20ల్లోనే ఆడతానని.. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టుకు తన అవసరం ఉంటే ఖఛ్చితంగా అందుబాటులో ఉంటానని డేవిడ్ భాయ్ తెలిపాడు.
''నేను వన్డేల నుంచి వైదొలుగుతున్నా. బారత్ గడ్డపై వరల్డ్ కప్ గెలవడం అతి పెద్ద ఘనతగా భావిస్తున్నా. టెస్టులు, వన్డేలకు గుడ్ బై చెప్పడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆయా డొమెస్టిక్ లీగ్స్ లో ఆడే అవకాశం ఉంటుంది. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ ఉందని నాకు తెలుసు. అయితే ఈ రెండేళ్లు నాణ్యమైన క్రికెట్ ఆడితే.. జట్టుకు అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటా'' అని ఈ స్టార్ ఓపెనర్ చెప్పాడు.
2009లో సఫారీతో జరిగిన సిరీస్ తో వన్డేల్లో ఆరంగేట్రం చేశాడు వార్నర్. ఈ స్టార్ బ్యాటర్ ఇప్పటివరకూ 161 వన్డేల్లో 97.26 స్ట్రైక్ రేటుతో 6,932 పరుగులు చేశారు. ఇందులో 22 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆసీస్ తరఫున రికీ పాంటింగ్(29) తర్వాత అత్యధిక శతకాలు చేసిన రెండో క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియా 2023 వన్డే ప్రపంచకప్ గెలవడంలో వార్నర్ కీ రోల్ ప్లే చేశాడు. ఈ స్టార్ ఓపెనర్ 11 మ్యాచుల్లో 535 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం.
Also Read: IND W vs AUS W Highlights: రెండో వన్డేలో 3 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా.. సిరీస్ ఆసీస్ సొంతం..
మరోవైపు టెస్టులకు ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్ కు.. స్వదేశంలో పాకిస్థాన్ తో జరుగుతున్న సిరీస్ లో చివరి మ్యాచ్ ఆడనున్నాడు. ఈ టెస్టు మ్యాచ్ జనవరి 03న ప్రారంభం కానుంది. టెస్టు కెరీర్ లో వార్నర్ 111 టెస్టుల్లో 8,695 పరుగులు సాధించాడు. ఇందులో 26 సెంచరీలు ఉన్నాయి.
Also Read: 2023 Sports Events:2023లో మరచిపోని అద్భుతమైన స్పోర్ట్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook