కేటీఆర్‌ని అందుకే కలిశాను: అజారుద్దీన్

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టేన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ ఇవాళ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ని కలిశారు. అజారుద్దీన్ హెచ్‌సిఏ ప్యానెల్ సభ్యులతో కలిసి వెళ్లి కేటీఆర్‌ని కలవడంతో ఆయన కాంగ్రెస్ పార్టీ వీడి టీఆర్ఎస్‌లో చేరుతున్నారా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే, కేటీఆర్‌ని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన అజారుద్దీన్.. క్రికెట్‌ ప్రమోషన్‌కి ప్రభుత్వ సహకారం అందించాలని కోరేటందుకే కేటీఆర్‌ను కోరినట్లు తెలిపారు. క్రీడలకు తెలంగాణ సర్కార్ పెద్ద పీట వేస్తోందని చెప్పిన అజారుద్దీన్.. సీఎం కేసీఆర్‌ను కూడా కలిసి సహకారం కోరతామని తెలిపారు. పార్టీలకతీతంగా అందర్నీ కలిసి సహకారం కోరతామని అన్నారు.

English Title: 
Azharuddin meets KTR, fuels speculation of joining TRS party
News Source: 
Home Title: 

కేటీఆర్‌ని అందుకే కలిశాను: అజారుద్దీన్

కేటీఆర్‌ని అందుకే కలిశాను: అజారుద్దీన్
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
కేటీఆర్‌ని అందుకే కలిశాను: అజారుద్దీన్
Publish Later: 
Yes
Publish At: 
Saturday, September 28, 2019 - 12:36
Created By: 
Pavan Reddy Naini
Updated By: 
Pavan Reddy Naini