స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ ఖేల్ ఖతం

బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడి క్రికెట్ లో ఒక్కసారిగా కలకలం రేపిన ఆసీస్ క్రికెటర్ల కెరీర్ ముగిసినట్లుగా తెలుస్తోంది.

Last Updated : Mar 26, 2018, 01:12 PM IST
స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ ఖేల్ ఖతం

బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి క్రికెట్‌లో ఒక్కసారిగా కలకలం రేపిన ఆసీస్ క్రికెటర్ల కెరీర్ ముగిసినట్లుగా తెలుస్తోంది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ పై ఇప్పటికే ఓ మ్యాచ్ నిషేధం, ఫీజులో 100 శాతం కోతను విధించగా.. ఇతడితో పాటు వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ పై జీవితకాల నిషేధం విధిస్తారని సమాచారం. తప్పుడాటతో దేశం పరువు తీసిన ఆటగాళ్లపై ఆస్ట్రేలియా ప్రధాని టర్నబుల్, ఇతర ప్రముఖులు ఆగ్రహంగా ఉండటంతో వీరిని ఆదుకొనేవారు కరువయ్యారు.

వార్నర్, స్మిత్‌లపై త్వరలోనే నిర్ణయం

బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న స్మిత్, వార్నర్‌ల ఐపీఎల్ భవితవ్యంపై రెండు, మూడు రోజుల్లోగా నిర్ణయం తీసుకుంటామని ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపారు. 'బాల్ ట్యాంపరింగ్‌ను మేము సీరియస్‌గా తీసుకుంటున్నాం. ఫ్రాంచైజీలను సంప్రదించిన తరువాత మా తుది నిర్ణయం వెల్లడిస్తాం' అని ఆయన చెప్పారు. కాగా స్టీవ్ స్మిత్‌ను ఇప్పటికే ఆర్ఆర్ (రాజస్తాన్ రాయల్స్) కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పించిన సంగతి తెలిసిందే..! కాగా స్మిత్ స్థానంలో రహానేకు కెప్టెన్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. త్వరలో అధికారిక ప్రకటన చేయనుంది. 

Trending News