BAN Vs AFG: టెస్టు క్రికెట్‌లో బంగ్లాదేశ్ (Bangladesh) అరుదైన ఘనత సాధించింది. అఫ్గానిస్థాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ లో 546 పరుగుల భారీ తేడాతో గెలుపొంది ప్రపంచ రికార్డును సృష్టించింది. దీంతో 21వ శతాబ్దంలో టెస్టు క్రికెట్ (Test Cricket) చరిత్రలో అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా బంగ్లాదేశ్ సరికొత్త చరిత్ర లిఖించింది. ఇప్పటి వరకు చూసుకుంటే.. 1928లో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ 675 పరుగుల తేడాతో విజయం సాధించి అగ్రస్థానంలో కొనసాగుతోంది. 1934లో ఇంగ్లాండ్‌పై ఆసీస్ 562 పరుగుల తేడాతో గెలుపొంది రెండో స్థానంలో ఉంది.
మరోవైపు బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్...నజ్ముల్ హుస్సేన్ షాంటో (146) సెంచరీ కొట్టడంతో 382 పరుగులు చేసింది. మహ్మదుల్లా హసన్ (76), ముష్పీకర్ రహీమ్ (47), హసన్ మిరాజ్ (48) బ్యాట్ తో రాణించారు. అఫ్గాన్ బౌలర్లలో మసూద్ 5 వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ మెుదలుపెట్టిన అప్గాన్ బ్యాటర్లు.. బంగ్లా బౌలర్లు ముందు నిలవలేకపోయారు. 146 పరుగులకే చాప చుట్టేశారు. ఆ జట్టు ఆటగాళ్లలో అప్సర్ జాజయ్ 36 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.
236 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లా..భారీ స్కోరు చేసింది. నజ్ముల్ హుస్సేన్ శాంటో (124), మోమినుల్ హక్ (121) సెంచరీలతో చెలరేగడంతో 425/4 వద్ద బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతర రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అప్గాన్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో చేసిన స్కోరు కంటే తక్కువ స్కోరుకు ఆలౌట్ అయ్యారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మాద్ నాలుగు వికెట్లు, షారిపుల్ ఇస్లాం మూడు వికెట్లు తీశారు. అప్గాన్ టీమ్ కేవలం 115 పరుగులకే కుప్పకూలింది. దీంతో బంగ్లాదేశ్ రికార్డు విజయాన్ని అందుకుంది.
Also Read: IND Vs WI: విండీస్ టూర్‌కు రోహిత్, విరాట్ దూరం..! టెస్ట్ కెప్టెన్‌గా ఆ ప్లేయర్‌కు ఛాన్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి