Rohit Sharma: డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓటమి తరువాత టీమిండియా వెస్టిండీస్ టూర్‌కు రెడీ అవుతోంది. విండీస్ టూర్‌కు ఈ నెల 27న బీసీసీఐ జట్టును ప్రకటించనుంది. వెస్టిండీస్ టూర్‌లో టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. గత కొద్దిరోజులుగా నాన్‌స్టాప్‌గా క్రికెట్ ఆడుతున్న సీనియర్లకు ఈ టూర్ నుంచి విశ్రాంతి ఇచ్చే యోచనలో సెలెక్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే, టీ20 సిరీస్‌లలో విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. టూర్ మొత్తానికి ఈ ఇద్దరు దూరమైతే.. టెస్టులకు అజింక్య రహానే కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. వన్డేలు, టీ20ల్లో హార్ధిక్ పాండ్యా జట్టును నడిపిస్తాడు. అదేవిధంగా మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌లకు కూడా ఈ పర్యటన నుంచి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది.
సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్ వంటి యంగ్ ప్లేయర్లు వన్డే, టెస్ట్, టీ20 సిరీస్‌లలో ఎంట్రీ ఇవ్వనున్నారు. టెస్ట్ జట్టులోకి వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్‌ను తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఆసీస్ టూర్‌తోపాటు డబ్ల్యూటీసీ ఫైనల్‌లో విఫలమైన కేఎస్ భరత్‌పై వేటు పడే ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఛెతేశ్వర్ పుజరాను కూడా సెలెక్టర్లు పక్కనపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పుజరా స్థానంలో జైస్వాల్‌కు టెస్టు జట్టులో అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు సమాచారం. హార్దిక్ పాండ్యాను మళ్లీ టెస్టు జట్టులోకి తీసుకువచ్చేందుకు చర్చలు జరుపుతున్నారు.
Also Read: Ambati Rayudu: పొలిటికల్ పిచ్‌పై బ్యాటింగ్‌కు అంబటి రాయుడు రెడీ.. అక్కడి నుంచే పోటీ..?
"హార్దిక్ పాండ్యా టెస్టు జట్టులోకి తీసుకుకోవాలి. సెలెక్టర్లు అతనిని వైట్ జెర్సీలో చూడాలనుకుంటున్నారు. కానీ పాండ్యా మూడు ఫార్మాట్లలో ఆడే స్థితిలో ఉన్నాడా అనేది తేలాల్సి ఉంది. ముఖ్యంగా వన్డేలలో కీలక ఆటగాడిగా ఉన్న పాండ్యా.. టెస్టులు ఆడేందుకు మొగ్గుచూపుతాడో లేదో చూడాలి.." అని ఓ బీసీసీఐ అధికారి వెల్లడించాడు.
భారత్ పర్యటన ఇలా..
టెస్ట్ సిరీస్
మొదటి మ్యాచ్ - జులై 12 నుంచి 16 వరకు- విండ్సర్ పార్క్, రోసో, డొమినికా.
రెండో మ్యాచ్ - జులై 20 నుంచి 24 వరకు- క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ట్రినిడాడ్.
వన్డే సిరీస్
ఫస్ట్ వన్డే- జులై 27- కెన్సింగ్టన్ ఓవల్, బ్రిడ్జ్‌టౌన్, బార్బడోస్.
రెండో వన్డే- జులై 29- కెన్సింగ్టన్ ఓవల్, బ్రిడ్జ్‌టౌన్, బార్బడోస్.
మూడో వన్డే- ఆగస్టు 1- ట్రినిడాడ్‌లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్.
టీ20 సిరీస్
మొదటి మ్యాచ్-ఆగస్టు 4-ట్రినిడాడ్‌లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్.
రెండో మ్యాచ్-ఆగస్టు 6- గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియం.
మూడో మ్యాచ్-ఆగస్టు 8- గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియం.
నాల్గో మ్యాచ్-ఆగస్టు 12- సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్, లాడర్‌హిల్, ఫ్లోరిడా.
ఐదో మ్యాచ్ -ఆగస్టు 13- సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్, లాడర్‌హిల్, ఫ్లోరిడా.
Also Read: Pawan Kalyan Speech: సీఎం కావడానికి నేను సంసిద్ధం.. తల తెగినా మాటకు కట్టుబడి ఉంటా: పవన్ కళ్యాణ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి