ఐపీఎల్ 2018: స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లకు మరో శిక్ష

బాల్ ట్యాంపరింగ్ కేసులో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా క్రమశిక్షణ చర్యలు తీసుకున్న మరుక్షణమే బీసీసీఐ సైతం చర్యలకు ఉపక్రమించింది. 

Last Updated : Mar 29, 2018, 01:00 AM IST
ఐపీఎల్ 2018: స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లకు మరో శిక్ష

బాల్ ట్యాంపరింగ్ కేసులో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా క్రమశిక్షణ చర్యలు తీసుకున్న మరుక్షణమే బీసీసీఐతోపాటు ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా కూడా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లను ఐపీఎల్ 2018కి దూరం పెడుతున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. దీంతో రానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌‌లో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లకు పాల్గొనే అవకాశం లేదని, ఆ ఇద్దరి స్థానంలో వేరే ఆటగాళ్లను తీసుకోవాల్సిందిగా ఐపీఎల్ కమిషనర్ రాజీవ్ శుక్లా రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీలకు స్పష్టంచేశారు.  

ఐపీఎల్ 2018 వేలం కాంట్రాక్ట్ ఒప్పందం ప్రకారం ఐపీఎల్‌ 2018లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు స్మిత్ కెప్టెన్సీ వహించాల్సి వున్నప్పటికీ.. బాల్ ట్యాంపరింగ్ వివాదం తర్వాత స్మిత్ కెప్టెన్సీ పదవి నుంచి తప్పుకున్నాడు. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టేన్‌గా వ్యవహరించాల్సి వున్న డేవిడ్ వార్నర్ సైతం బాల్ ట్యాంపరింగ్ వివాదంలో దొరికిపోయి ఆ పోస్టుని పోగొట్టుకున్నాడు. ఇప్పటివరకు ఈ ఇద్దరూ తమ తమ కెప్టెన్సీలనే కోల్పోయారని అనుకుంటుండగా.. తాజాగా ఐపీఎల్‌లో అసలు ఆడే అవకాశం ఇవ్వడం లేదని ఐపీఎల్ కమిషనర్ రాజీవ్ శుక్లా తేల్చిచెప్పారు. 

బాల్ ట్యాంపరింగ్ వివాదంలో ఐసీసీ, క్రికెట్ ఆస్ట్రేలియా ఏం నిర్ణయం తీసుకుంటాయోనని వేచిచూసిన అనంతరమే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాజీవ్ శుక్లా పేర్కొన్నారు.

Trending News