8 Persons Killed in a Huge Accident at Mahabubabad: ప్రపంచమంతా మరికొద్ది గంటల్లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి సిద్ధం అవుతుంటే తెలంగాణలో మాత్రం తీవ్ర విషాదం నెలకొంది. తెలంగాణలోని మహబూబాబాద్ లో లారీలో షిప్పింగ్ కోసం తీసుకు వెళుతున్న ఒక గ్రానైట్ బండ జారీ దాని వెనకే వెళుతున్న ప్రయాణికులు ఆటో మీద పడడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది కూలీలు మృతి చెందిన ఘటన ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపింది.
ఇక ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతిచెందగా మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. వెంటనే స్పందించిన స్థానికులు అక్కడ ఉన్నవారందరినీ స్థానిక ఆస్పత్రికి తరలించారు పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం మృతులు అందరూ చిన్న గూడూరు మండలం మంగోరి గూడెం అనే గ్రామానికి చెందిన కూలీలు అని తెలుస్తోంది. కూలీ పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు.
మంగోరి గూడెం గ్రామానికి చెందిన 11 మంది కూలీలు కూలి పనికి వెళ్లి పూర్తి చేసుకుని తిరిగి ఒక ఆటోలో వస్తున్నారు. అదే సమయంలో వారి ముందు వెళ్తున్న గ్రానైట్ లారీలోని గ్రానైట్ బండ జారిపోవడంతో అది వచ్చి ఆటో మీద పడింది. డ్రైవర్ గ్రానైట్ బండను సరిగ్గా కట్టకపోవడంతోనే గ్రానైట్ బాండ్ జారినట్లుగా పోలీసుల ప్రాథమికంగా నిర్ధారించారు. గ్రానైట్ బండ ఒక్కసారిగా ఆటో మీద పడడంతో ఆటోలో ఉన్న ఆరుగురు కూలీలు అక్కడే మరణించారు.
మిగతా వాళ్ళు తీవ్రంగా గాయపడగా వాళ్లను సమీపంలో ఉన్న స్థానిక ఆస్పత్రులకు తరలించిన క్రమంలో మరో ఇద్దరు ప్రాణాలు వదిలారు. మిగతా ముగ్గురి పరిస్థితి కూడా తీవ్ర విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే గ్రానైట్ బండ జారీ ఎనిమిది మంది మృతి చెందినట్లు తెలుస్తోంది.
అయితే మృతుల సంఖ్య మీద సరైన క్లారిటీ లేదు, ఎంతమంది చనిపోయారు అనే విషయం మీద అధికారికంగా పోలీసులు ప్రకటన చేయాల్సి ఉంది. ముందుగా ఐదుగురు చనిపోయారని వార్తలు వచ్చాయి, తర్వాత ఆరుగురు చనిపోయారని వార్తలు వచ్చాయి. ప్రస్తుతానికైతే ఎనిమిది మంది చనిపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తే గాని ఎంతమంది అసువులు బాసారు అనే విషయం మీద క్లారిటీ వచ్చే అవకాశం లేదు.
Also Read: Hyderabad Police: మందేసి రోడ్డెక్కారా ఇక మీ 'అంతే'.. ఈ రోడ్లు అన్నీ క్లోజ్!
Also Read: Dulquer Salmaan Telugu Film : సీతారామం తరువాత మరో తెలుగు సినిమా ఒప్పుకున్న దుల్కర్ ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Mahabubabad: నూతన సంవత్సరాది ముందు తీవ్ర విషాదం.. యాక్సిడెంట్లో 8 మంది దుర్మరణం?