Asif Ali in CPL 2020: ఔట్ అయ్యాననే కోపంతో బౌలర్‌పైకి బ్యాట్ ఎత్తిన పాకిస్తాన్ క్రికెటర్

కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ( CPL 2020 ) జమైకా తలవాన్స్, గుయానా అమెజాన్ వారియర్స్ జట్ల ( Jamaica Tallawahs vs Guyana Amazon Warriors ) మధ్య క్వీన్స్ పార్క్ ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌ సందర్భంగా జమైకా జట్టు తరపున బ్యాటింగ్ చేస్తున్న పాకిస్తాన్ క్రికెటర్ ఆసిఫ్ అలీ ( Asif Ali ) 3 పరుగులకే ఔటయ్యాడు.

Last Updated : Aug 27, 2020, 01:25 AM IST
Asif Ali in CPL 2020:  ఔట్ అయ్యాననే కోపంతో బౌలర్‌పైకి బ్యాట్ ఎత్తిన పాకిస్తాన్ క్రికెటర్

జమైకా: కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ( CPL 2020 ) జమైకా తలవాన్స్, గుయానా అమెజాన్ వారియర్స్ జట్ల ( Jamaica Tallawahs vs Guyana Amazon Warriors ) మధ్య క్వీన్స్ పార్క్ ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌ సందర్భంగా జమైకా జట్టు తరపున బ్యాటింగ్ చేస్తున్న పాకిస్తాన్ క్రికెటర్ ఆసిఫ్ అలీ ( Asif Ali ) 3 పరుగులకే ఔటయ్యాడు. Carribean Premier League లో మంచి పర్‌ఫార్మెన్స్ కనబర్చిన ఆసిఫ్ అలీ.. ఈ మ్యాచ్‌లోనూ ఓ షాట్‌కి ట్రై చేయగా... డీప్ మిడ్-వికెట్ రీజియన్‌లో కాచుకుకూర్చున్న క్రిస్ గ్రీన్ డైవ్ వేసి మరీ ఆ బంతిని ఒడిసిపట్టుకున్నాడు. ఐతే అప్పటికే సింగిల్ రన్ కోసం నాన్ స్ట్రైకర్ క్రీజువరకు పరిగెత్తుకొచ్చిన ఆసిఫ్ అలీకి.. నువు ఔట్ అయ్యావని చెప్పాడు బౌలర్ కీమో పాల్ ( Keemo Paul ). ఔట్ అయ్యాననే అక్కసుతో వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆసిఫ్ అలీ.. కీమో పాల్ ఉన్న వైపు బ్యాట్ ఎత్తాడు. ఆసిఫ్ బ్యాట్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న కీమో.. ఈ ఊహించని పరిణామానికి ఒక్కసారిగా షాకయ్యాడు. Also read : 

ఈ మ్యాచ్‌లో జమైకా జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించినప్పటికీ.. ఆ జట్టు బ్యాట్స్‌మేన్ ఆసిఫ్ అలీకి మాత్రం క్రమశిక్షణ చర్యల కింద పనిష్మెంట్ ఎదుర్కోక తప్పదని తెలుస్తోంది. Also read : 

Trending News