Mahesh Babu డైలాగ్‌తో వార్నర్ మళ్లీ సంచలనం!

టిక్ టాక్ ద్వారా వీడియోలు చేసి భారత్‌లో అభిమానుల్ని పెంచుకుంటున్నాడు ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్. ఈ క్రికెటర్ చేసిన బుట్టబొమ్మ సాంగ్‌ టిక్ టాక్ బాగా పాపులర్ కావడంతో అదే పంథాను కొనసాగిస్తున్నాడు. Warner Tik Tok over Mahesh Babu  Dialogue

Last Updated : May 10, 2020, 02:59 PM IST
Mahesh Babu డైలాగ్‌తో వార్నర్ మళ్లీ సంచలనం!

లేకలేక కుటుంబంతో గడిపేందుకు అధిక సమయం దొరకడంతో సినీ సెలబ్రిటీలు, క్రికెటర్లు లాక్‌డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా టిక్ టాక్ ద్వారా వీడియోలు చేసి భారత్‌లో అభిమానుల్ని పెంచుకుంటున్నాడు ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్. ఈ క్రికెటర్ చేసిన బుట్టబొమ్మ సాంగ్‌ టిక్ టాక్ బాగా పాపులర్ కావడంతో అదే పంథాను కొనసాగిస్తున్నాడు. నేడు ప్రముఖ నిర్మాత దిల్ రాజు వివాహం

తాజాగా మరో తెలుగు సినిమా డైలాగ్‌పై మనసు సారేసుకున్నాడు వార్నర్. టాలీవుడ్‌లో ఆల్ టైమ్ రికార్డులు బద్ధలుకొట్టిన పూరీ జగన్నాధ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ ‘పోకిరి’ని ఎంచుకున్నాడు. ‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’ అనే ఫేమస్ డైలాగ్‌కు టిక్ టాక్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అయితే బ్యాట్ చేతపట్టాడు కనుక, తాను కమిట్ అయితే బౌలర్లకు చుక్కలేనంటూ పరోక్షంగా సూచించాడు వార్నర్. తెలుగింటి అందం పూజిత పొన్నాడ

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Guess the movie?? I tried everyone 🤷🏼‍♂️🤷🏼‍♂️Good luck 😂😂 #tollywood #requested #helpme #

A post shared by David Warner (@davidwarner31) on

ఈ డైలాగ్ ఏ సినిమాలోదో గెస్ చేయాలని తన పోస్టులో పేర్కొన్నాడు. సమాధానం చెప్పాలని యత్నించేవారికి గుడ్ లక్ అని టాలీవుడ్ ట్యాగ్‌తో వార్నర్ ఆ డైలాగ్ టిక్ టాక్ వీడియోను పోస్ట్ చేశాడు. ఫాలోయర్ల నుంచి విశేష స్పందన వస్తుండటంతో వార్నర్ తన వీడియోల వేటను కొనసాగిస్తున్నాడు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

Trending News