Deepak Chahar and his Wife Jaya Bhardwaj Dance video goes viral: టీమిండియా స్టార్ బౌలర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు దీపక్ చహర్ ఇటీవలే ఓ ఇంటివాడైన విషయం తెలిసిందే. తన చిన్ననాటి స్నేహితురాలు జయా భరద్వాజ్‌ను 2022 జూన్ 1న వివాహం చేసుకున్నాడు. పెళ్లి వేడుక ఆగ్రాలోని జైపీ ప్యాలెస్‌లో కుటుంబసభ్యులు, బంధుమిత్రలు, అత్యంత సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. చహర్ వివాహ వేడుకకి పలువురు టీమిండియా క్రికెటర్లు కూడా హాజరయ్యారు.
పెళ్లి తర్వాత రోజు దీపక్ చహర్, జయా భరద్వాజ్‌ల రిసెప్షన్ ఢిల్లీలో ఘనంగా జరిగింది. ఈ రిసెప్షన్‌కు చెన్నై సూపర్ కింగ్స్ మరియు భారత క్రికెట్ జట్టులోని చాలా మంది క్రికెటర్లు హాజరయ్యారు. భారీ సెట్టింగ్, పెద్దపెద్ద సౌండ్ బాక్సులు జరిగిన ఈ రిసెప్షన్‌లో దీపక్, జయా తమ డాన్సులతో సందడి చేశారు. హిందీ పాటలకు ఇద్దరు కలిసి డాన్స్ చేశారు. ఆపై జయా ఒక్కరే డాన్స్ చేసి అందరిని అలరించారు. ఈ డ్యాన్స్ వీడియోను ఆదివారం (జూన్ 19)న దీపక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
డాన్స్ చేయడానికి ముందు నేను చాలా ఒత్తిడికి గురయ్యానని దీపక్ చహర్ క్యాప్షన్ ఇచ్చాడు. 'బౌలింగ్ చేస్తున్నప్పుడు క్రికెట్ పిచ్‌పై కంటే ఎక్కువ ఒత్తిడికి గురయ్యా' అని రాసుకొచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫాన్స్ అందరూ తనదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. 'సతీమణి ముందు తేలిపోయిన దీపక్ చహర్' అని ఒకరు కామెంట్ చేయగా.. 'జయా భరద్వాజ్ డాన్స్ అదుర్స్' అని మరొకరు ట్వీట్ చేశారు. జయా బాలీవుడ్‌లోకి వెళ్లండి, జయా హీరోయిన్‌గా ట్రై చేయండి అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
గాయం కారణంగా దీపక్ చహర్ ఐపీఎల్ 2022లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఐపీఎల్ 15 సీజన్ మెగా వేలంలో చహర్‌ను రూ .14 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ ప్రాంచైజీ కొనుగోలు చేసింది. గతేడాది సీజన్లో సీఎస్‌కే విజేతగా నిలవడంతో అతడు ముఖ్యపాత్ర పోషించాడు. అందుకే భారీ ధరకు సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2022లో సీఎస్‌కే 14 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 10 ఓటమలుతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. 29 ఏళ్ల చహర్ భారత్ తరఫున 7 వన్డేలు, 20 టీ20లు ఆడాడు.
Also Read: Maharashtra Suicide: మహారాష్ట్రలో పెను విషాదం.. ఒకే ఇంట్లో 9 మృతదేహాలు!
Also Read: Agnipath Protest Case: సికింద్రాబాద్ అల్లర్ల కేసులో పోలీసుల స్పీడప్..వారి పాత్ర నిజమేనా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook