భారత బౌలర్ల కమాల్; 287 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్ 

                        

Last Updated : Aug 2, 2018, 04:46 PM IST
భారత బౌలర్ల కమాల్; 287 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్ 

ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బౌలర్లు పై చేయి సాధించారు.  ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్లు టీమిండియా బౌలర్లును ఎదుర్కొవడంలో తడబడ్డారు. ఫలితంగా  తొలి ఇన్నింగ్ లో ఇంగ్లండ్  287 పరుగులకే ఆలౌటైంది. 9 వికెట్లకు 285 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్.. మరో రెండు పరుగులు మాత్రమే జోడించి చివరి వికెట్ కోల్పోయింది.కాగా చివరి వికెట్ మహ్మద్ షమికి దక్కింది. ఈ ఇన్నింగ్ లో ఆఫ్ స్పిన్నర్  అశ్విన్ 4 వికెట్లు, ఫేసర్ షమికి 3 వికెట్లు, ఉమేష్, ఇషాంత్ చెరొక వికెట్ తీసుకున్నారు. 

ఇదిలా ఉండగా ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లో కెప్టెన్ రూట్ 80 రన్స్ చేయగా బెయిర్‌స్టో 70 రన్స్ చేసి స్వల్ప స్కోర్ కే పరిమితం కాకుండా ఇంగ్లండ్ పరువు నిలబెట్టారు. ఈ ఇద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 103 పరుగులు జోడించినా.. రూట్ రనౌట్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. చివరి సెషన్‌లో స్పల్ప వ్యవధిలో ఇంగ్లండ్ వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఇంగ్లండ్ 287 స్కోరుకే పరిమితమైంది. దీంతో తొలి ఇన్నింగ్ లో ఇండియా పైచేయి సాధించినట్లంది.

స్కోర్ వివరాలు ఇలా ఉన్నాయి...

కడపటి వార్తలు అందే సరికి భారత్ వికెట్లు ఏమీ కోల్పోకుండా 50 పరుగులు చేసింది. ఓపెనర్లు మురళీ విజయ్ 20 పరుగులు, శిఖర్ ధావన్ 21 పరుగులతో క్రీజులో ఉన్నాయి. ఈ రోజు వికెట్లు కోల్పోకుండా స్థిరంగా పరుగులు చేసి.. ఇంగ్లండ్ పై ఒత్తిడి పెంచాలనే వ్యూహాంతో కోహ్లీ సేన బ్యాటింగ్ కు దిగింది.

Trending News