Temba Bavuma: నెదర్లాండ్స్‌పై గెలుస్తామనుకున్నాం.. సీన్ రివర్స్ అయింది: దక్షిణాఫ్రికా కెప్టెన్

Temba Bavuma Crying after South Africa Out from T20 World Cup 2022. పసికూన నెదర్లాండ్స్ చేతిలో అనూహ్య ఓటమి తర్వాత దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Nov 6, 2022, 04:02 PM IST
  • నెదర్లాండ్స్‌పై గెలుస్తామనుకున్నాం
  • సీన్ రివర్స్ అయింది
  • దక్షిణాఫ్రికా కెప్టెన్ భావోద్వేగం
Temba Bavuma: నెదర్లాండ్స్‌పై గెలుస్తామనుకున్నాం.. సీన్ రివర్స్ అయింది: దక్షిణాఫ్రికా కెప్టెన్

 Temba Bavuma react on South Africa defeat vs Netherlands in T20 World Cup: టీ20 ప్రపంచకప్‌ 2022 సెమీస్ బెర్త్ దక్కించుకోవాలంటే తప్పక గెలవాల్సిన సూపర్ 12 మ్యాచ్‌లో పసికూన నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోయింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో ఓడిన దక్షిణాఫ్రికా మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 159 పరుగులు చేయగా.. స్వల్ప లక్ష్స ఛేదనలో ప్రొటీస్ బ్యాటర్లు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 145 రన్స్‌ మాత్రమే చేశారు. దక్షిణాఫ్రికా ఓటమితో గ్రూప్‌ 2 నుంచి పాకిస్తాన్‌ జట్టుకు సెమీస్‌ చేరే అవకాశం దక్కింది. నేడు బంగ్లాను ఓడించిన పాక్ దర్జాగా సెమీస్‌కు చేరింది. 

పసికూన నెదర్లాండ్స్ చేతిలో అనూహ్య ఓటమిని ఎదుర్కొన్న దక్షిణాఫ్రికా ప్లేయర్స్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మ్యాచ్‌ అనంతరం ప్రొటీస్ కెప్టెన్‌ టెంబా బవుమా, స్టార్ బ్యాటర్‌ డేవిడ్‌ మిల్లర్‌ కంటతడిపెడుతూ కనిపించారు. టీ20 ప్రపంచకప్‌ 2022లో గొప్ప ప్రదర్శన చేసినా.. సెమీస్‌కు చేరలేకపోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని బవుమా చెప్పాడు. 'కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో మేం తడబడ్డాం. ఈ మ్యాచ్‌ కచ్చితంగా గెలుస్తామనుకున్నాం. కానీ సీన్ రివర్స్ అయింది' అని బవుమా అన్నాడు. 

'ఈ ఓటమిని మా జట్టు ప్లేయర్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. టాస్‌ గెలిచినప్పటికీ.. నెదర్లాండ్స్ జట్టును158 పరుగులు చేయకుండా కట్టడి చేయలేకపోయాం. ఛేదనలో త్వరగా వికెట్స్ కోల్పోయాం. చాలా చెత్తగా ఆడాం. ఓ ఓటమి అస్సలు ఊహించలేదు. పాక్‌తో మ్యాచ్‌లోనూ కీలక సమయంలో వికెట్లను కోల్పోయి మూల్యం చెల్లించుకున్నాం. మెగా టోర్నీలో మేం మరింత శ్రమించి ఉండాల్సింది' అని ప్రొటీస్ కెప్టెన్‌ టెంబా బవుమా పేర్కొన్నాడు. 

గ్రూప్ 2 నుంచి భారత్, పాకిస్తాన్ జట్లు సెమీస్ చేరాయి. మరోవైపు గ్రూప్ 1 నుంచి ఇంగ్లండ్, న్యూజీలాండ్ జట్లు అర్హత సాధించాయి. నవంబర్ 9, 10న సెమీస్ మ్యాచులు జరుగుతాయి. ఇక నవంబర్ 13న ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం ఫాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.

Also Read: కార్తీక పౌర్ణమినాడే చంద్రగ్రహణం.. హైదరాబాద్‌లో టైమింగ్స్! సూతకాలంలో చేయకూడని పనులు ఇవే

Also Read: Virat Kohli: ఆ లక్షణాలే.. విరాట్‌ కోహ్లీ సక్సెస్‌కు కారణం: శిఖర్‌ ధావన్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News