Hardik Pandya Ruled Out Of World Cup 2023: వరల్డ్ కప్‌లో వరుస విజయాలతో సెమీస్‌కు చేరిన టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా స్టార్ ఆల్‌రౌండర్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో చీలమండ గాయం కారణంగా హార్దిక్ పాండ్యా ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. తొలుత రెండు మ్యాచ్‌లకు దూరమవుతాడని ప్రచారం జరగ్గా.. తాజాగా టోర్నీ నుంచి తప్పుకున్నట్లు ఐసీసీ వెల్లడించింది. పాండ్యా స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణను టీమ్‌లోకి ఎంపిక చేసినట్లు తెలిపింది. పాండ్యా దూరమవ్వడంతో జట్టు కూర్పు దెబ్బతింటుంది.
బంగ్లాదేశ్ మ్యాచ్‌లో పాండ్యా బౌలింగ్‌లో స్ట్రెయిట్ డ్రైవ్‌ను కాలితో ఆపేందుకు ప్రయత్నించి గాయపడ్డాడు. ఆ మ్యాచ్‌లో వెంటనే మైదానం నుంచి వెళ్లిపోగా.. న్యూజిలాండ్, ఇంగ్లాండ్, శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. పాండ్యా స్థానంలో పేసర్‌గా వచ్చిన మహ్మద్ షమీ.. మూడు మ్యాచ్‌ల్లోనూ అదరగొట్టాడు. షమీ 3 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీశాడు. అయితే పాండ్యా టోర్నీ నుంచి తప్పుకోవడంతో ఇదే కూర్పుతో భారత్ ఆడాల్సి ఉంటుంది. ఇప్పటికే 7 మ్యాచ్‌లో 14 పాయింట్లతో సెమీస్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్న టీమిండియా.. తరువాతి రెండు మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ జట్లతో తలపడనుంది. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉండడంతో భారత్‌కు పాండ్యాలేని లోటు కనిపించకపోవచ్చని నిపుణులు అంటున్నారు.
కాగా.. హార్థిక్ పాండ్యా ఈ ప్రపంచకప్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు తీశాడు. బంగ్లాపై మూడు బంతులు వేసి గాయంతో వెళ్లిపోయాడు. మూడు మ్యాచ్‌ల్లో ఒక్కసారే బ్యాటింగ్ ఆడే అవకాశం వచ్చింది. ఆ మ్యాచ్‌లో 11 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఐసీసీ ఈవెంట్ టెక్నికల్ కమిటీ పాండ్యా రీప్లేస్‌మెంట్‌కు ఆమోదం తెలిపిన తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్‌కు ఎంపిక కోసం అందుబాటులో ఉంటాడు. ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో వేదికగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్.. రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికాతో తలపడనుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవాలంటే.. రేపు సఫారీని ఓడించాల్సిందే. పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో నిలిస్తే.. నాలుగో స్థానంలో ఉన్న జట్టుతో సెమీ ఫైనల్ ఆడుతుంది. సెమీస్, ఫైనల్ గెలిస్తే.. 12 ఏళ్ల నిరీక్షణ తరువాత భారత్ విశ్వకప్‌ను ముద్దాడుతుంది.
Also Read: Pan India Movies: పాన్ ఇండియా సినిమాలతో ఓటీటీలకు తలనొప్పి..భారీ స్థాయిలో నష్టాలు
Also Read: Nepal Earthquake 2023: నేపాల్‌లో భారీ భూకంపం, 70మందికి పైగా మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Hardik Pandya: టీమిండియాకు ఊహించని షాక్.. టోర్నీ మొత్తానికి పాండ్యా దూరం.. ఆ పేసర్‌కు ఛాన్స్