న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా నేడు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. బీసీసీఐకి 39వ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన గంగూలీ మరో 9 నెలలపాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. బీసీసీఐ కొత్త పాలకవర్గం సైతం నేడే ఏర్పాటైంది. గంగూలీతో పాటు నూతన కార్యదర్శిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనయుడు జై షా, కోశాధికారిగా కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తమ్ముడు అరుణ్ ధూమల్ బాధ్యతలు స్వీకరించారు. ఉత్తరాఖండ్‌కి చెందిన మహిం వర్మ ఉపాధ్యక్షుడిగా ఎన్నికవగా కేరళకు చెందిన జయేష్ జార్జ్ సంయుక్త కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అందరూ ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరమే రాలేదనే సంగతి తెలిసిందే. విజయనగరం మహారాజా తర్వాత బీసీసీఐ అధ్యక్షుడిగా పగ్గాలు అందుకున్న తొలి క్రికెటర్ గంగూలీనే కావడం విశేషం.
ఆటగాడిగా, టీమిండియా కెప్టేన్‌గా ఎన్నో విజయాలను అందుకున్న గంగూలీ.. బీసీసీఐ అధ్యక్షుడిగా ప్రారంభిస్తున్న కొత్త ఇన్నింగ్స్‌లోనూ విజయాలు అందుకోవాలంటూ దాదాకు అభినందనలు వెల్లువెత్తున్నాయి.
గంగూలీ కెరీర్‌లో కొత్త ఇన్నింగ్స్