ICC Test Rankings: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు సూపర్ న్యూస్.. టెస్టుల్లో నెం.1గా టీమిండియా

Team India No.1 Place in ICC Test Rankings: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్. టెస్ట్ ర్యాంక్సింగ్స్‌లో టాప్‌ ప్లేస్‌ను సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టింది. టీ20ల్లో కూడా నెంబర్ వన్ స్థానంలో నిలవగా.. వన్డేల్లో మూడోస్థానంలో నిలిచింది.   

Written by - Ashok Krindinti | Last Updated : May 2, 2023, 04:27 PM IST
ICC Test Rankings: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు సూపర్ న్యూస్.. టెస్టుల్లో నెం.1గా టీమిండియా

Team India No.1 Place in ICC Test Rankings: టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా మళ్లీ నెంబర్‌ వన్ స్థానానికి చేరుకుంది. ఐసీసీ తాజాగా టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల చేయగా.. భారత్ మొదటి స్థానంలో నిలిచింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ మ్యాచ్‌కు ముందు భారత్ అగ్రస్థానానికి చేరుకోవడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియా రెండో స్థానానికి పడిపోయింది. గత 25 మ్యాచ్‌ల్లో భారత్ 3031 పాయింట్లు సాధించగా.. మొత్తం 121 రేటింగ్ పాయింట్లతో నెం.1 ర్యాంక్‌ సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా 23 మ్యాచ్‌ల్లో 2679 పాయింట్లు సాధించి.. 116 రేటింగ్ పాయింట్లతో రెండోస్థానానికి పరిమితమైంది. 

ఆ తరువాత స్థానాల్లో మూడోస్థానంలో ఇంగ్లాండ్ నిలవగా.. నాలుగు, ఐదు స్థానాల్లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ ఉన్నాయి. ఇటీవల ఆసీస్‌ జరిగిన బోర్డర్ గావస్కర్ ట్రోఫీని టీమిండియా 2-1 తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ గెలుపుతో ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌కు భారత్ అర్హత సాధించంతోపాటు.. కంగారూ జట్టును వెనక్కి నెట్టి నంబర్ వన్ జట్టుగానూ నిలిచింది. 2021-23 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో ఆస్ట్రేలియా మొదటిస్థానంలో నిలవగా.. భారత్ రెండోస్థానంలో నిలిచింది. టీమిండియా వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత్.. న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైంది. 

ఈసారి రోహిత్ శర్మ కెప్టెన్సీలో టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడనుంది. జూన్ 7వ తేదీ నుంచి ఇంగ్లాండ్ ఓవల్ వేదికగా కంగారూ జట్టుతో తలపడనుంది. 2013లో ఛాంపియన్ ట్రోఫీ గెలిచిన భారత్.. ఆ తరువాత మళ్లీ ఐసీసీ ట్రోఫీని ముద్దాడలేదు. డబ్ల్యూటీసీ ట్రోఫీని గెలిచి.. ఆ గ్యాప్‌ను పూర్తి చేయాలని చూస్తోంది. ఇప్పటికే టీమ్‌ను కూడా ప్రకటించింది బీసీసీఐ. ఐపీఎల్ పూర్తి కాగానే.. టీమిండియా ఇంగ్లాండ్‌లో అడుగుపెట్టనుంది.  

టెస్ట్ ర్యాంకింగ్స్‌తోపాటు టీ20 ఫార్మాట్‌లోనూ భారత్ నెంబర్ వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. టీమిండియా 267 రేటింగ్ పాయింట్లతో మొదటిస్థానంలో నిలవగా.. ఇంగ్లాండ్ 259 పాయింట్లతో రెండోస్థానంలో ఉంది. వన్డే ర్యాంక్సింగ్స్‌లో 113 పాయింట్లతో ఆస్ట్రేలియా టాప్ ప్లేస్‌లో నిలిచింది. రెండోస్థానంలో కివీస్ ఉండగా.. భారత్ మూడోస్థానంలో ఉంది. మూడు జట్లకు సమాన పాయింట్లు ఉన్నా.. దశాంశ పాయింట్ల తేడాతో నెంబన్ వన్ ర్యాంక్ ఆసీస్ సొంతమైంది. 

టీ20 నెంబర్ వన్‌ బ్యాట్స్‌మెన్‌గా సూర్యకుమార్ యాదవ్ కొనసాగుతున్నారు. నెంబర్ వన్ టెస్ట్ ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా, నెంబర్ వన్ బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్ తమ ర్యాంకులను నిలబెట్టుకున్నారు. టెస్ట్ ఆల్‌రౌండర్ల జాబితాలో అశ్విన్ రెండోస్థానంలో ఉండగా.. అక్షర్ పటేల్ నాలుగో స్థానంలో నిలిచాడు. ఇక నెంబర్ వన్ టెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా లబుషానే నిలిచాడు. టీమిండియా నుంచి రిషబ్ పంత్ మాత్రమే టాప్-10లో చోటు దక్కించుకున్నాడు.

Also Read: YS Sharmila: బీఆర్ఎస్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో చెప్పిన వైఎస్ షర్మిల.. మొత్తం ఎన్ని కోట్లంటే..?  

Also Read: Virat Kohli Vs Gautam Gambhir: విరాట్ కోహ్లీ, గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం.. షాకిచ్చిన బీసీసీఐ  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

 ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News