Nathan Lyon becomes most visiting wicket taker bowler in Asia: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023 సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో ఈరోజు ప్రారంభం అయిన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ తేలిపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాను ఆస్ట్రేలియా బౌలర్లు వణికించారు. స్పిన్నర్లు మాథ్యూ కుహ్నెమన్, నాథన్ లియోన్ చెలరేగడంతో టీమిండియా 109 పరుగులకు ఆలౌటైంది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (22) టాప్ స్కోరర్. స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ (12), శుబ్‌మన్ గిల్ (21), ఛతేశ్వర్ పుజారా (1), శ్రేయస్ అయ్యర్ (0) నిరాశపరిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో కునెమన్ ఐదు వికెట్లు పడగొట్టగా.. లైయన్ 3, మార్ఫీ 1 వికెట్ తీశారు.
స్పిన్ పిచ్‌పై ఆస్ట్రేలియా స్పిన్నర్లు చెలరేగిపోయారు. మాథ్యూ కుహ్నెమన్ శుభారంభం అందించగా.. నాథన్ లియోన్ దానిని కొనసాగించాడు. సీనియర్ స్పిన్నర్ లియోన్.. ఛతేశ్వర్ పుజారా, రవీంద్ర జడేజా, కేఎస్ భరత్ వికెట్స్ పడగొట్టాడు. దాంతో లియోన్ ఓ అరుదైన ఘనతను సాధించాడు. ఆసియాలో అత్యధిక వికెట్లు తీసిన పర్యాటక బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. పుజారా వికెట్ తీసి ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ పేరిట ఉన్న ఈ రికార్డును సమం చేసిన లియోన్.. జడేజా వికెట్‌తో అధిగమించాడు.
ప్రస్తుతం ఆసియాలో అత్యధిక వికెట్లు తీసిన విదేశీ బౌలర్‌గా నాథన్ లియోన్ ఉన్నాడు. లియోన్ ఆసియాలో ఇప్పటివరకు 129 వికెట్స్ పడగొట్టాడు. దివంగత దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ 127 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో న్యూజిలాండ్ మాజీ స్పిన్నర్ డానియెల్ వెటోరీ (98) మూడో స్థానంలో ఉండగా.. దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డెయిల్ స్టెయిన్ (92) నాలుగో స్థానాల్లో ఉన్నాడు. వెస్టిండీస్ మాజీ పేసర్ కోర్ట్నీ వాల్ష్ (77) ఐదవ స్థానంలో ఉన్నాడు.
తొలి ఇన్నింగ్స్‌ని ఆరంభించిన ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. ఆర్ జడేజా వేసిన రెండో ఓవర్ నాలుగో బంతికి ఓపెనర్ ట్రావిస్ హెడ్ (9) ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. తొలుత అంపైర్ నాటౌట్‌గా ప్రకటించగా.. డీఆర్‌ఎస్‌కు వెళ్లిన భారత్ సక్సెస్ అయింది. కాసేపటికి మార్నస్ లబుషేన్ ఔట్ అయినా.. నో బాల్ కావడంతో బతికిపోయాడు. 11 ఓవర్లకు ఆసీస్ స్కోరు 39/1.ఉస్మాన్ ఖవాజా (15), లబుషేన్ (7) పరుగులతో ఉన్నారు.
Also Read: Yulu Bajaj EV Scooter: డెలివరీ బాయ్స్‌కు గుడ్ న్యూస్.. డెడ్ ఛీప్‌గా ఎలక్ట్రిక్ డెలివరీ స్కూటీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.