IND vs AUS, 4th Test Live Score | బోర్డర్-గవాస్కర్ ట్రోఫిలో కీలకమైన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో భారత బౌలర్లు (Team India) చెలరేగుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు భారత బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. మొదటి ఓ ఓవర్‌లోనే విధ్వంసక బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్‌ను హైదరాబాద్ ఫేసర్ మహ్మద్ సిరాజుద్దీన్ పెవిలియన్‌కు పంపించాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే శార్థుల్ ఠాకూర్ అద్భుతమైన బౌలింగ్‌తో మార్కస్ హారీస్‌ను ఔట్ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా 17 పరుగులకే రెండు వికెట్లు కొల్పోయి ఆసీస్ కష్టాల్లో కూరుకుపోయింది.
ఇదిలాఉంటే.. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో (India vs Australia) తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆసీస్ గెలవగా.. రెండో టెస్ట్‌లో భారత్ గెలిచింది. మూడో టెస్ట్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. అయితే మూడు టెస్ట్ మ్యాచుల్లో.. సిరీస్ 1-1తో సమంగా ఉంది. నిర్ణయాత్మకమైన నాలుగో టెస్ట్ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని భారత్ (India) పోరాడుతుండగా... సొంత గడ్డపై పరువు దక్కించుకోవాలని ఆసీస్ (Australia) ఆరాటపడుతోంది.
Australia have won the toss and opted to bat first in the 4th and final Test of the Border-Gavaskar Trophy. We have four changes. #TeamIndia #AUSvIND pic.twitter.com/87TrZAkA1Z
— BCCI (@BCCI) January 14, 2021
టీమిండియా జట్టు..
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, ఛటేశ్వర్ పుజారా, అజింక్య రహానె (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రిషబ్ పంత్, సుందర్, శార్దూల్ ఠాకూర్, నవదీప్ సైని, మహ్మద్ సిరాజ్, టి. నటరాజన్. Also Read: India vs Australia 3rd Test Highlights: ఇండియా Vs ఆస్ట్రేలియా 3వ టెస్ట్ రికార్డులు
ఆస్ట్రేలియా జట్టు..
డేవిడ్ వార్నర్, మార్కస్ హారిస్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, మాథ్యూ వేడ్, కామెరూన్ గ్రీన్, టిమ్ పెయిన్ (కెప్టెన్), ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లైయన్, జాష్ హేజిల్‌వుడ్ Also Read: Steve Smith నిజంగానే తప్పిదం చేశాడా.. తేల్చేసిన Full Video
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook