Smriti Mandhana helps India beat Pakistan By 8 Wickets in CWG 2022: కామన్‌వెల్త్ గేమ్స్ 2022లో భాగంగా పాకిస్తాన్ మహిళలతో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత మహిళలు సునాయాస విజయం సాధించారు. 100 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి 11.4 ఓవర్లలో 102 పరుగులు చేసి విజయం సాధించింది. కీలక మ్యాచులో ఓపెనర్ స్మృతీ మంధాన (63 నాటౌట్; 42 బంతుల్లో 8x4, 3x6) హాఫ్ సెంచరీ చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. పాకిస్తాన్ బౌలర్లలో టుబా హస్సన్, ఓమైమ సోహైల్ చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో కామన్వెల్త్‌లో భారత క్రికెట్ అమ్మాయిలు తొలి గెలుపును అందుకున్నారు.
వర్షం కారణంగా 18 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగారు. పేసర్లు, స్పిన్నర్లు రాణించడంతో పాక్ బ్యాటర్లు వరుస విరామాల్లో పెవిలియన్‌కు క్యూ కట్టారు. పాక్ ఓపెనర్ మునీబ్ అలీ (32; 30 బంతుల్లో 3x4, 1x6) మాత్రమే పర్వాలేదనిపించింది. ఇరామ్ జావెద్ (0), బిస్మా మరూఫ్ (17), ఆయేషా నసీమ్ (10), ఒమమా సొహైల్ (10), అలియా రియాజ్ (18), ఫాతిమా సనా (8), డయానా బైగ్ (0), ట్యూబా హసన్ (1), కైనత్ ఇంతియాజ్ (2) స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా, రాధా యాదవ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. రేణుకా సింగ్, మేఘనా సింగ్, షెఫాలీ వర్మ తలో వికెట్ తీశారు.
స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ మహిళలకు శుభారంభం దక్కింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ (16), స్మృతీ మంధాన పాక్ బౌలర్లపై విరుచుకుపడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలోనే తొలి వికెట్ కు 61 పరుగులు జోడించారు. వేగంగా ఆడే క్రమంలో షెఫాలీ పెవిలియన్ చేరినా.. మంధాన జోరు మాత్రం తగ్గలేదు. ఆమెకు సబ్బినేని మేఘన (14) మంచి సహకారం అందించింది. చివరలో మేఘన ఔట్ అయినా.. జెమీమా రోడ్రిగెజ్ (2 నాటౌట్)తో కలిసి మంధాన మ్యాచ్ ముగించింది. కేవలం 11.4 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసిన హర్మన్ సేన సునాయాస విజయం అందుకుంది.
𝐀𝐋𝐋 𝐎𝐕𝐄𝐑!
Clinical with the ball & splendid with the bat, 𝐈𝐧𝐝𝐢𝐚 𝐛𝐞𝐚𝐭 𝐏𝐚𝐤𝐢𝐬𝐭𝐚𝐧 by 8 wickets in their 2nd Commonwealth Games match. 👏 👏
Vice-captain @mandhana_smriti smashes 63*. 🙌 🙌
Scorecard ▶️ https://t.co/6xtXSkd1O7 #B2022 #TeamIndia #INDvPAK pic.twitter.com/MVUX3yFO4s
— BCCI Women (@BCCIWomen) July 31, 2022
Aloso Read: Viral Video: చీకటి రోడ్డులో డ్రైవింగ్.. దెయ్యాన్ని చూసి సుస్సు పోసుకున్న యువకులు!
Also Read: CWG 2022: భారత్ ఖాతాలో మరో గోల్డ్ మెడల్.. రికార్డు సృష్టించిన 19 ఏళ్ల జెరెమీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook