Prince Movie Twitter Review : ప్రిన్స్ ట్విట్టర్ రివ్యూ.. అనుదీప్ సినిమాపై అలాంటి టాక్

Siva Karthikeyan Prince Movie Twitter Review శివ కార్తికేయన్ కేవీ అనుదీప్ కాంబోలో వస్తోన్న ప్రిన్స్ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. నేడు విడుదలైన ఈ మూవీ ట్విట్టర్లో హంగామా చేస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 21, 2022, 07:45 AM IST
  • నేడు విడుదల కానున్న ప్రిన్స్
  • శివ కార్తికేయన్ సినిమాకు నెగెటివ్ టాక్
  • పని చేయని అనుదీప్ మంత్రం?
Prince Movie Twitter Review : ప్రిన్స్ ట్విట్టర్ రివ్యూ.. అనుదీప్ సినిమాపై అలాంటి టాక్

Prince Movie Twitter Review : జాతి రత్నాలు సినిమాతో అనుదీప్ అదిరిపోయే హిట్ కొట్టేశాడు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన జాతి రత్నాలు బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఈ సినిమా కరోనా సమయంలో విడుదలైనా కూడా బాక్సాఫీస్ వద్ద కనకవర్షాన్ని కురిపించింది. దీంతో జాతి రత్నాలు సినిమాతో అనుదీప్ క్రేజ్ పెరిగింది. దర్శకుడిగా అనుదీప్‌కు మంచి డిమాండ్ వచ్చింది. మధ్యలో ఇతర సినిమాలకు కథను కూడా అందించాడు. 

 

కానీ అవేమీ అంతగా హిట్ కాలేదు. అయితే ఇప్పుడు అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన ప్రిన్స్ సినిమా మీద అందరి దృష్టి పడింది. ఎందుకంటే ఈ సినిమాను ఓ తమిళ హీరోతో చేశాడు అనుదీప్. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. శివ కార్తికేయన్ అంటే తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

 

ఇప్పటికే కొన్ని చోట్ల షోలు పడ్డాయి. దీంతో టాక్ బయటకు వచ్చింది. కొందరేమో ఈ సినిమా యావరేజ్ అని అంటున్నారు. ఇంకొందరేమో సూపర్ అంటున్నారు. మరి కొందరైతే.. సెకండ్ హాఫ్ అదిరిపోయిందని, తెగ నవ్వించేశారని అంటున్నారు. మొత్తానికి ప్రిన్స్‌ చిత్రానికి యావరేజ్, సూపర్ అంటూ ఇలా మిక్స్డ్‌ టాక్ వచ్చేసింది. 

 

కొందరేమో ఈ సినిమా మిస్టర్ లోకల్ 2లా ఉందంటూ కౌంటర్లు వేస్తున్నారు. ప్రిన్స్ సినిమా ఆడటం కష్టమే అని అంటున్నారు. అయితే హాలీవుడ్‌కు క్రిఫ్‌ ఈవన్స్.. కోలీవుడ్‌కు శివ కార్తికేయన్.. సక్సెస్ వల్లే ఈ నెగెటివిటీ వస్తుంటుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దళపతి విజయ్ బీస్ట్ సినిమాలోని అరబిక్ కుత్తు పాట రిఫరెన్స్ ఇందులో ఉందని అంటున్నారు.

 

దళపతి విజయ్ సీన్ వచ్చినప్పుడు థియేటర్లో పూనకాలే అంటూ చెబుతున్నారు. అయితే ఈ సినిమాకు స్టోరీ సరిగ్గా లేదని, కామెడీ దాదాపుగా వర్కౌట్ అయిందని అంటున్నారు. సత్యరాజ్ అదరగొట్టేశాడని, బీజీఎం, సాంగ్స్ అదిరిపోయాయ్ అని, ప్రథమార్థం బోర్ కొట్టించినా, సెకండాఫ్‌ నవ్వించేశారని అంటున్నారు. 

 

సెకండాఫ్‌లోని హ్యూమర్ కంటే ప్రథమార్థంలోని నవ్వులే బాగా ఉన్నాయ్ అని ఇంకొకరు అంటున్నారు. తమన్ కొట్టిన నేపథ్య సంగీతం అదిరిపోయిందని అంటున్నారు.  శివ కార్తికేయ మరియా జంట బాగుందని చెబుతున్నారు. ప్రేమ్‌జీ మంచి పాత్ర వేశారని అంటున్నారు. సత్య రాజ్ దుమ్ములేపేశాడు.. సున్నితంగా సాగిపోయే ఈ సినిమాను ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చని అంటున్నారు.

Also Read : Ginna Movie Twitter Review : జిన్నాకు మొదటి రోజే ఎదురుదెబ్బ?

Also Read : Kethika Sharma Hot Photos: రొమాంటిక్ చూపులతో చంపేస్తోన్న కేతిక శర్మ.. బికినీలో పరువాల విందు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News