Odisha CM Naveen Patnaik buys IND vs SA 2nd T20I first ticket: మెగా టోర్నీ ఐపీఎల్ 2022 ముగిసిన తర్వాత భారత జట్టు స్వదేశంలో టీ20 సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. తెంబా బవుమా కెప్టెన్సీలోని దక్షిణాఫ్రికా జట్టుతో టీమిండియా ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఇరు జట్ల మధ్య జూన్ 9 నుంచి 19 వరకు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జూన్ 9న తొలి మ్యాచ్ జరగనుంది. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు బీసీసీఐ సెలెక్టర్లు విశ్రాంతినివ్వడంతో కేఎల్ రాహుల్ జట్టు పగ్గాలు అందుకున్నాడు.
జూన్ 12న ఒడిశా కటక్‌లోని బారాబతి స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచుకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ హాజరుకానున్నారు. ఇందుకోసం అయన రెండో టీ20 మ్యాచ్ తొలి టిక్కెట్‌ను కొనుగోలు చేశారు. సోమవారం సాయంత్రమే ఒడిశా సీఎం టికెట్ అందుకున్నారు. ఒడిశా క్రికెట్ అసోసియేషన్ (ఓసీఏ) అధ్యక్షుడు పంకజ్ లోచన్ మొహంతి, ఓసీఏ కార్యదర్శి సంజయ్ బెహెరా సీఎంకు టికెట్ ఇచ్చారు. ఇందుకు సంబందించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
రెండో టీ20 మ్యాచ్ కోసం కటక్ స్టేడియం వద్ద ఒడిశా క్రికెట్ అసోసియేషన్ టిక్కెట్ల విక్రయం ఏర్పాటు చేసింది. చాలా కాలం తర్వాత మ్యాచ్ జరుగుతుండడంతో క్రికెట్ అభిమానులు టికెట్స్ కోసం ఎగబడుతున్నారట. దాంతో టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయట. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోకి రావడంతో ఈ టీ20 సిరీస్ కోసం బీసీసీఐ బయోబబుల్ నియమాలను తొలగించింది. ఐపీఎల్ 2022 ప్లే ఆఫ్ మ్యాచ్‌లకు పూర్తి స్థాయిలో ప్రేక్షకులు వచ్చిన విషయం తెలిసిందే.
జట్ల వివరాలు:
భారత్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.
దక్షిణాఫ్రికా: తెంబా బవుమా (కెప్టెన్), క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఎయిడెన్ మార్కరమ్, డేవిడ్ మిల్లర్, లుంగీ ఎన్గిడి, అన్రిచ్ నోర్జ్, వేన్ పార్నెల్, డ్వైన్ ప్రిటోరియస్, కగిసో రబాడా, తబ్రేజ్ షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్, రాసీ వాన్ డెర్ డస్సెన్, మార్కో జాన్సెన్.
Also Read: Ante Sundaraniki Pre Release Event: 'అంటే సుందరానికి' ప్రీరిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా?
Also Read: SSMB28 Update: మహేశ్ బాబు, త్రివిక్రమ్ సినిమాకు ముహూర్తం ఫిక్స్.. షూటింగ్ ఎప్పటినుంచో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook