India vs Sri Lanka Dream11 Prediction: లంకేయులతో నేడు టీమిండియా ఢీ.. ప్లేయింగ్11, పిచ్ రిపోర్ట్, డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం..

India Vs Sri Lanka Dream11 Prediction Tips and Streaming Details: పాక్‌తో మ్యాచ్‌ ముగిసిన మరుసటి రోజే టీమిండియా మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఆసియా కప్‌లో నేడు భారత్, శ్రీలంక జట్ల మధ్య పోరు జరగనుంది. పిచ్ రిపోర్ట్, డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం..  

Written by - Ashok Krindinti | Last Updated : Sep 12, 2023, 12:02 PM IST
India vs Sri Lanka Dream11 Prediction: లంకేయులతో నేడు టీమిండియా ఢీ.. ప్లేయింగ్11, పిచ్ రిపోర్ట్, డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం..

India Vs Sri Lanka Dream11 Prediction Tips and Streaming Details: పాకిస్థాన్‌ను భారీ తేడాతో చిత్తు చేసిన టీమిండియా.. అదే ఊపులో నేడు శ్రీలంకతో ఆసియా కప్-4 మ్యాచ్‌లో తలపడనుంది. పాక్‌పై విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ సెంచరీలతో చెలరేగగా.. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ అర్ధ సెంచరీలతో రాణించారు. బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు. దీంతో 228 పరుగుల తేడాతో విజయం సాధించింది. శ్రీలంకను కూడా ఓడించి.. ఫైనల్ బెర్త్‌ కన్ఫార్మ్ చేసుకోవాలని చూస్తోంది. భారత్ ప్రస్తుతం సూపర్ 4 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. శ్రీలంక రెండో స్థానంలో ఉంది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు చేస్తుందా..? పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది..? ఎక్కడ లైవ్ స్ట్రీమింగ్ చూడాలి..? డ్రీమ్11 టీమ్‌లో ఎవరిని ఎంచుకోవాలి..? పూర్తి వివరాలు ఇలా..

కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో భారత్, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇక్కడి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఈ పిచ్‌పై టీమిండియా టాప్-4 బ్యాట్స్‌మెన్ పరుగుల వరద పారించారు. ఆట మధ్యలో స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. పేసర్లకు మ్యాచ్‌ చివరిలో సహకారం అందుతుంది. ఇక్కడ మొదటి బ్యాటింగ్ చేసిన జట్లే ఎక్కువసార్లు విజయం సాధించాయి. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.

స్ట్రీమింగ్ వివరాలు.. 

వేదిక: ఆర్.ప్రేమదాస స్టేడియం, శ్రీలంక
సమయం: మధ్యాహ్నం 3 గంటలకు నుంచి ప్రారంభం
స్ట్రీమింగ్ వివరాలు: స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, డిస్నీ +హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం ఉచితంగా చూడొచ్చు.

తుది జట్లు ఇలా.. (అంచనా)

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక (కెప్టెన్), దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, మతీషా పతిరణ.

డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇలా..

వికెట్ కీపర్లు: కేఎల్ రాహుల్, కుశాల్ మెండిస్ (వైస్ కెప్టెన్)

బ్యాట్స్‌మెన్లు: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, పాతుమ్ నిస్సాంక

ఆల్‌రౌండర్లు: హార్దిక్ పాండ్యా, డిసిల్వా

బౌలర్లు: జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహేశ్ తీక్షణ.

Also Read: SBI RD Interest Rates: ఎస్‌బీఐ ఆర్‌డీలో రూ.5 వేలు పెడితే.. రూ.55 వేలు లాభం.. ఎలాగంటే..?

Also Read: Health Tips in Telugu: పాలలో ఖర్జూరం మరగబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. ఒక్కసారి తీసుకుంటే..!     

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News