IND vs WI: భారత్‌లో ఇలాంటి స్పెల్ ఎప్పుడూ చూడలేదు.. అతడు అద్భుత బౌలర్: రోహిత్ శర్మ

Rohit Sharma hails Prasidh Krishna: పేస‌ర్ ప్రసిద్ధ్ కృష్ణపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రసిద్ధ్ అద్భుత‌మైన బౌలర్ అని, ఈరోజు అతడు వేసిన స్పెల్‌ భారత్‌లో ఎప్పుడూ చూడలేదన్నాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 10, 2022, 02:56 PM IST
  • భారత్ vs వెస్టిండీస్‌ రెండో వన్డే
  • ప్రసిద్ధ్ కృష్ణపై రోహిత్ శర్మ ప్రశంసల వర్షం
  • భారత్‌లో ఇలాంటి స్పెల్ ఎప్పుడూ చూడలేదు
IND vs WI: భారత్‌లో ఇలాంటి స్పెల్ ఎప్పుడూ చూడలేదు.. అతడు అద్భుత బౌలర్: రోహిత్ శర్మ

Rohit Sharma hails Prasidh Krishna: టీమిండియా యువ పేస‌ర్ ప్రసిద్ధ్ కృష్ణపై కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రసిద్ధ్ అద్భుత‌మైన బౌలర్ అని, ఈరోజు అతడు వేసిన స్పెల్‌ భారత్‌లో ఎప్పుడూ చూడలేదన్నాడు. ప్రసిద్ధ్ మాత్రమే కాకుండా బౌలర్లు అందరూ అద్భుతంగా రాణించారని హిట్‌మ్యాన్ పేర్కొన్నాడు. అహ్మ‌దాబాద్ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రిగిన రెండో వ‌న్డేలో భారత్ 44 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పేస‌ర్ ప్రసిద్ధ్ కృష్ణ నాలుగు వికెట్ల ప‌డ‌గొట్టి అద్భుతంగా రాణించాడు. 

మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ... 'వన్డే సిరీస్‌ను గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది. మ్యాచ్‌లో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. అయితే బ్యాటింగ్‌లో సూర్యకుమార్‌ యాదవ్, లోకేష్ రాహుల్ మధ్య భాగస్వామ్యంతో మంచి స్థితికి చేరుకున్నాం. వారిద్దరూ ఎంతో పరిణతితో ఆడారు. ఒత్తిడిలో ఇలా ఆడటం జట్టుకు ఎంతో కీలకం. చివరికి గౌరవప్రదమైన స్కోరును సాధించాం. సూర్య విలువైన సమయాన్ని క్రీజులో గడిపాడు. అతని నుంచి జట్టు ఏమి కోరుకుంటుందో అర్థం చేసుకున్నాడు. రాహుల్ బాగా బ్యాటింగ్ చేశాడు' అని అన్నాడు. 

'ఈ మ్యాచులో బౌలర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా యువ బౌలర్‌ ప్రసిద్ధ్ కృష్ణ. అతని బౌలింగ్ నన్నెంతో ఆశ్చర్యానికి గురి చేసింది. చాలా కాలంగా భారత్‌ పిచ్‌ల మీద ఇలాంటి స్పెల్‌ను నేను ఎప్పుడూ చూడలేదు. ప్రసిద్ధ్ సూపర్‌ పేస్‌తో బంతులను సంధించాడు. మంచు లేకపోవడంతో నేను కొంచెం ఆశ్చర్యపోయాను. జట్టుకు చాలా బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి.. బౌలర్లను రొటేట్ చేయాల్సి ఉంటుంది. దీపక్ చహర్ రూపంలో మాకు ఇంకో మంచి పేసర్ కూడా ఉన్నాడు' అని రోహిత్ తెలిపాడు. 9 ఓవర్లు వేసిన ప్రసిద్ధ్‌ కేవలం 12 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.

'బ్యాటింగ్‌ ఆర్డర్‌లో కొన్ని ప్రయోగాలు చేయాలని భావించా. అందుకే వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ఓపెనర్‌గా పంపించాం. తర్వాతి మ్యాచ్‌కు శిఖర్‌ ధావన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కొన్ని కాంబినేషన్స్ ప్రయత్నించేటప్పుడు మ్యాచులు కోల్పోయినా.. భవిష్యత్తును చూసుకోవడం ముఖ్యం' అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. అత్యంత తక్కువ పరుగులు ఇచ్చి నాలుగు అంతకంటే ఎక్కువ వికెట్లను పడగొట్టిన భారత బౌలర్లలో ప్రసిద్ధ్ మూడో క్రికెటర్‌. స్టువర్ట్ బిన్నీ (6/4), భువనేశ్వర్‌ కుమార్ (4/8) ప్రసిద్ధ్ కంటే ముందు ఉన్నారు.

Also Read: Saniya Iyappan: ఓపెన్ షవర్ కింద హీరోయిన్ స్నానం.. సిగ్గులేదా అంటూ నెటిజన్ కామెంట్ (వీడియో)!

Also Read: IND vs WI: సరిగ్గా పరిగెత్తడం కూడా రాదా?.. టీమిండియా క్రికెటర్‌పై మండిపడిన రోహిత్ శర్మ (వీడియో)!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News