IND Vs WI Dream11 Team Today: విండీస్‌కు చెక్ పెట్టేందుకు భారత్ రెడీ.. స్ట్రీమింగ్ వివరాలు, డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇలా..!

India Vs West Indies Dream11 Team Prediction and Playing 11: భారత్-వెస్డిండీస్ జట్ల మధ్య నేడు రెండో టీ20 మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో పురాగమనం చేయాలని టీమిండియా చూస్తోంది. రెండు జట్ల ప్లేయింగ్ 11లో మార్పులు చేసే అవకాశం కనిపించడం లేదు. డ్రీమ్ 11 టీమ్‌ను ఇలా ఎంచుకోండి.  

Written by - Ashok Krindinti | Last Updated : Aug 6, 2023, 01:48 PM IST
IND Vs WI Dream11 Team Today: విండీస్‌కు చెక్ పెట్టేందుకు భారత్ రెడీ.. స్ట్రీమింగ్ వివరాలు, డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇలా..!

India Vs West Indies Dream11 Team Prediction and Playing 11: మొదటి టీ20 మ్యాచ్‌లో ఓటమి పాలైన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించి సిరీస్‌లో పుంజుకోవాలని చూస్తోంది. తొలి మ్యాచ్‌లో 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేశారు. బౌలింగ్‌లో ఇబ్బంది లేకపోయినా.. టీమిండియా బ్యాటింగ్ కలవర పరుస్తోంది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్‌కు తోడు సంజూ శాంసన్, కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్ శక్తి మేర ఆడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. బౌలింగ్‌లో స్పిన్నర్లు చాహల్, కుల్దీప్‌కు తోడు స్పీడ్‌స్టార్ అర్ష్‌దీప్ సింగ్ మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్‌లో పుంజుకుంటే గెలుపు సులువు అవుతుంది. 

టెస్టు, వన్డే సిరీస్‌లు కోల్పోయిన కరేబియన్ జట్టు.. టీ20 సిరీస్‌ను గెలుపుతో ఆరంభించింది. దీంతో సమరోత్సాహంతో రెండో మ్యాచ్‌కు రెడీ అవుతోంది. గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల నుంచి ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది..? తుది జట్టులో ఎవరు ఉంటారు..? మ్యాచ్‌ను ఎక్కడ చూడాలి..? డ్రీమ్ 11 టీమ్ టిప్స్ మీ కోసం.. 

పిచ్ రిపోర్ట్ ఇలా..

గయానా ప్రావిడెన్స్ స్టేడియం పిచ్ ఫాస్ట్ బౌలర్లకు ఎక్కువ సహకరిస్తుంది. ఇక్కడ లోస్కోరింగ్‌ గేమ్‌లే ఎక్కువగా జరిగాయి. తొలి ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు 123 పరుగులుగా ఉంది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడం ఇబ్బందిగా కష్టంగా మారుతుంది. స్లో వికెట్ కావడంతో స్పిన్నర్లకు కూడా సహాయం లభిస్తుంది. అయితే ఇటీవల జరిగిన టీ20 మ్యాచ్‌ల్లో ఈ మైదానంలో 150 పరుగులకు పైగా లక్ష్యాన్ని ఛేదించాయి. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.

వేదిక: గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియం
సమయం: రాత్రి 8 గంటల నుంచి
స్ట్రీమింగ్ వివరాలు: జియో సినిమా, ఫ్యాన్‌కోడ్ వెబ్‌సైట్, డీడీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

తుది జట్లు ఇలా (అంచనా)

భారత్: శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌ (వికెట్ కీపర్), తిలక్‌ వర్మ, హార్దిక్‌ (కెప్టెన్‌), సంజూ శాంసన్, సూర్యకుమార్‌, అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌, చాహల్‌, అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్‌కుమార్‌.

వెస్టిండీస్: కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, జాన్సన్ చార్లెస్ , నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), షిమ్రాన్ హిట్‌మేయర్, రోవ్‌మాన్ పావెల్ (కెప్టెన్), జేసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్.

డ్రీమ్ 11 టీమ్ టిప్స్..

వికెట్ కీపర్లు: ఇషాన్‌ కిషన్‌, నికోలస్ పూరన్ (కెప్టెన్)

బ్యాట్స్‌మెన్లు: రోవ్‌మాన్ పావెల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ

ఆల్‌రౌండర్లు: హార్ధిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), జేసన్ హోల్డర్, అక్షర్ పటేల్

బౌలర్లు: చాహల్, అర్ష్‌దీప్ సింగ్, షెపర్డ్

Also Read: EPFO Interest Update: ఈపీఎఫ్‌ వడ్డీ కోసం ఎదురుచూస్తున్నారా..? క్లారిటీ ఇదిగో..! బ్యాలెన్స్ ఇలా చెక్ చేసుకోండి  

 

Also Read: East Godavari Road Accident: ఫ్రెండ్‌షిప్ రోజు ఘోర విషాదం.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు దుర్మరణం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News