IND vs WI 2nd Test Day 2: భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. తొలుత టీమిండియా బ్యాటర్లు చెలరేగితే.. తర్వాత కరేబియన్ ఆటగాళ్లు నిలకడగా ఆడుతున్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ టీమ్ వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రెయిగ్ బ్రాత్‌వైట్ (37*), మెకంజీ(14*) ఆడుతున్నారు. తొలి ఇన్నింగ్స్ లో విండీస్ ఇంకా 352 పరుగుల వెనుకబడి ఉంది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 438 పరుగులకు ఆలౌటైంది.
ఓవర్ నైట్ స్కోరు 288/4తో రెండో రోజు ఆటను కొనసాగించిన కోహ్లీ, జడేజాలు నిలకడగా ఆడారు. ఈ క్రమంలో కోహ్లీ సెంచరీ, జడేజా అర్థ సెంచరీలు చేశారు. విరాట్ (121; 206 బంతుల్లో 11 ఫోర్లు), జడేజా (61; 152 బంతుల్లో 5 ఫోర్లు) పరుగులు చేసి ఔటయ్యారు. కోహ్లీ రనౌట్ కాగా.. జడేజా క్యాచ్ ఔటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన అశ్విన్ అద్భుతంగా ఆడి అర్థ శతకం (56; 78 బంతుల్లో 8 ఫోర్లు) సాధించాడు. ఇషాన్ బాగా ఆడుతున్నట్లు కనిపించినప్పటికీ కాసేపటికే హోల్డర్ కు చిక్కాడు. అనంతరం ఉనద్కత్, సిరాజ్ (0)లు స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు. చివర వికెట్ గా ఆశ్విన్ వెనుదిరిగాడు. కరేబియన్ బౌలర్లలో కీమర్ రోచ్, వారికన్ చెరో మూడు వికెట్లు తీశారు. జేసన్ హోల్డర్కు 2, గాబ్రియల్ ఒక వికెట్ దక్కింది.
Also Read: Yashasvi Jaiswal: రోహిత్‌తో కలిసి బ్యాటింగ్ చేయడం అద్భుతం.. ఆ సీక్రెట్ బయటపెట్టిన యశస్వి జైస్వాల్
అనంతరం బ్యాటింగ్ కు దిగిన విండీస్ ఓపెనర్లు బ్రాత్‌వైట్, త్యాగ్‌నారాయణ్ చందర్‌పాల్ ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించారు. అనంతరం వీరిద్దరూ దూకుడు పెంచి స్కోరు బోర్డును పరుగులెత్తించారు. ఈ క్రమంలో 33 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజా బౌలింగ్‌లో త్యాగ్‌నారాయణ్.. అశ్విన్‌కు చేతికి చిక్కాడు. దీంతో 71 పరుగుల ఓపెనింగ్ పార్టనర్ షిప్ కు బ్రేక్ పడింది. తర్వాత క్రీజులోకి వచ్చిన మెకంజీ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు.
Also Read: World Cup 2023: ఇదేం క్రేజ్ భయ్యా.. భారత్-పాక్ మ్యాచ్‌కు ఏకంగా ఆసుపత్రి బెడ్స్ బుకింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook