Ind Vs WI 2nd Test Highlights: వెస్టిండీస్‌తో జరుతున్న టెస్ట్ సిరీస్‌లో యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన బ్యాటింగ్‌తో మెస్మరైజ్ చేస్తున్నాడు. తొలి టెస్టులో భారీ శతకంతో చెలరేగిన యశస్వి.. రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి తొలి వికెట్‌కు 139 పరుగులు జోడించి.. గట్టి పునాది వేశాడు. డొమినికాలో జరిగిన మొదటి టెస్ట్‌లోనూ రోహిత్‌తో కలిసి 229 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన విషయం తెలిసిందే. రెండో టెస్టులో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది.
రోహిత్ శర్మతో కలిసి వరుసగా రెండు టెస్టుల్లోనూ శతక భాగస్వామ్యాలు నమోదు చేయడంపై యశస్వి జైస్వాల్ స్పందించాడు. రోహిత్ భయ్యాతో కలిసి బ్యాటింగ్ చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పాడు. తాము ఎప్పుడూ పరిస్థితిని బట్టి ఎలా ముందుకు వెళ్లాలో ఆలోచిస్తామన్నాడు. ఏం చేయాలనే విషయంపై ఓ ప్రణాళికతో ఉంటామన్నాడు. రోహిత్ శర్మతో కలిసి బ్యాటింగ్ చేయడం నిజంగా అద్భుతంగా ఉందన్నాడు.
చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ వంటి దిగ్గజ క్రికెటర్ల నుంచి సలహాలను ఎలా తీసుకుంటారని జైస్వాల్‌ను ప్రశ్నించగా.. "ప్రతి ఒక్కరికి విషయాలు చెప్పడానికి వారి సొంతంగా ఓ శైలి ఉంటుంది. ప్రతి ఒక్కరికి అనుభవం ఉంటుంది. నేను ప్రతిదీ వినడానికి ఇష్టపడతాను. నా ఆటకు ఏది సరిపోతుందో అది తీసుకుని.. అలానే ప్రయత్నిస్తాను. నేను చేస్తానని నిర్ధారించుకుంటాను. సీనియర్ ఆటగాళ్లతో మాట్లాడుతున్నప్పుడు.. వాళ్లు చెప్పే విషయాలు శ్రద్ధగా వింటా. వారి సలహాలను నా ఆటతీరును మెరుగుపర్చుకునేందుకు ఉపయోగించుకుంటా.." అని చెప్పాడు.
మొదటి టెస్టులో 171 పరుగుల చేసిన తరువాత రెండో టెస్టుల్లో సెంచరీ చేయకపోవడం నిరాశకు గురిచేసిందంటూ ఈ యంగ్ ఓపెనర్ చెప్పుకొచ్చాడు. కానీ క్రికెట్‌లో ఇది జరుగుతుందని.. తాను నిరంతరం నేర్చుకుంటూనే ఉంటానని చెప్పాడు. తాను ఎప్పుడు బ్యాటింగ్ చేసినా.. ఎంతసేపు బ్యాటింగ్ చేయగలనని నిర్ధారించుకోవడానికి ప్రయత్నిస్తానని పేర్కొన్నాడు. కానీ ఔట్ అయి పెవిలియన్‌కు వచ్చినప్పుడు నిరాశగా ఉంటుందన్నాడు. మొదటి టెస్టులో 171 పరుగులు చేసిన జైస్వాల్.. రెండో టెస్టులో 57 రన్స్ చేశాడు.
Also Read: Whatsapp Latest Update: వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. వీడియో కాల్ లిమిట్ పెంపు
Also Read: Manipur Violence: ఏ మాత్రం కనికరం చూపలేదు.. భయంకరమైన ఘటన గుర్తుచేసుకున్న బాధితురాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook