IND Vs WI Dream11 Prediction: మరికాసేపట్లో మూడో టీ20.. మ్యాచ్‌ ఎక్కడ చూడాలి..? డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం..

India vs West Indies Dream11 Team Tips and Playing 11: టీమిండియాకు మూడో టీ20 మ్యాచ్‌ డూ ఆర్‌ డైగా మారింది. సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సి ఉంది. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన విండీస్.. ఈ మ్యాచ్‌లో సిరీస్‌ సొంతం చేసుకోవాలని భావిస్తోంది.   

Written by - Ashok Krindinti | Last Updated : Aug 12, 2023, 11:02 AM IST
IND Vs WI Dream11 Prediction: మరికాసేపట్లో మూడో టీ20.. మ్యాచ్‌ ఎక్కడ చూడాలి..? డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం..

India vs West Indies Dream11 Team Tips and Playing 11: వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 0-2 తేడాతో వెనుకబడ్డ భారత్.. సిరీస్‌ను గెలవాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. డూ ఆర్‌ డై మ్యాచ్‌లో నేడు కరేబియన్‌ జట్టును ఎలాగైనా ఓడించాలని పట్టుదలతో ఉంది. బౌలింగ్‌లో స్థాయికి తగ్గట్లు ఆడుతున్నా.. బ్యాటింగ్‌లో మాత్రం ముకుమ్మడిగా విఫలమవుతోంది. హైదరాబాదీ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ మినహా మిగిలిన వారేవారు ఆశించినస్థాయిలో రాణించడం లేదు. మిగిలిన మ్యాచ్‌ల్లో బ్యాటింగ్ తీరు ఇలానే ఉంటే.. సిరీస్‌పై ఆశలు వదులుకోవాల్సిందే. 

ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ సొంతం చేసుకోవాలని కరేబియన్ జట్టు భావిస్తోంది. మూడు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచినా సిరీస్‌ విండీస్ వశం అవుతుంది. 2016 తరువాత భారత్‌పై సిరీస్‌ గెలవలేకపోయిన వెస్టిండీస్.. కరువు తీర్చుకోవాలని చూస్తోంది. రెండో టీ20 మ్యాచ్‌ జరిగిన గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల నుంచి మ్యాచ్ జరగనుంది. పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది..? తుది జట్టులో ఎవరు ఉంటారు..? మ్యాచ్‌ను ఎక్కడ చూడాలి..? డ్రీమ్11 టీమ్‌లో ఎవరిని ఎంచుకోవాలి..? పూర్తి వివరాలు ఇలా..

పిచ్ రిపోర్ట్ ఇలా..

గయానా ప్రావిడెన్స్ స్టేడియం పిచ్ స్లోగా ఉంటుంది. ఫాస్ట్ బౌలర్లకు ఎక్కువ సహకరించినా.. మ్యాచ్ సాగే కొద్దీ స్పిన్నర్లు ప్రభావం చూపిస్తారు. బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడం కాస్త కష్టమే. అయితే క్రీజ్‌ కాసేపు కుదురుకుంటే.. మరీ అంతకష్టమేమి కాదని తిలక్ వర్మ, నికోలస్ పూరన్ నిరూపించారు. తొలి ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు 161 పరుగులుగా ఉంది. ఛేజింగ్ చేసిన జట్లకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 80 శాతం రెండోసారి బ్యాటింగ్ జట్లే గెలుపొందాయి. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌కు మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. 

వేదిక: గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియం
సమయం: రాత్రి 8 గంటల నుంచి
స్ట్రీమింగ్ వివరాలు: జియో సినిమా, ఫ్యాన్‌కోడ్ వెబ్‌సైట్, డీడీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

ప్లేయింగ్ 11 ఇలా.. (అంచనా)

భారత్: శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌ (వికెట్ కీపర్), తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యా (కెప్టెన్‌), సంజూ శాంసన్, సూర్యకుమార్‌ యాదవ్, అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్, చాహల్‌, అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్‌కుమార్‌/ఉమ్రాన్ మాలిక్/అవేశ్ ఖాన్

వెస్టిండీస్: కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, జాన్సన్ చార్లెస్ , నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్‌మయర్, రోవ్‌మాన్ పావెల్ (కెప్టెన్), జేసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్.

డ్రీమ్ 11 టీమ్ టిప్స్..

వికెట్ కీపర్లు: ఇషాన్‌ కిషన్‌ (కెప్టెన్), నికోలస్ పూరన్ 

బ్యాట్స్‌మెన్లు: రోవ్‌మాన్ పావెల్ (వైస్ కెప్టెన్), బ్రాండన్ కింగ్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ

ఆల్‌రౌండర్లు: హార్ధిక్ పాండ్యా, జేసన్ హోల్డర్ 

బౌలర్లు: చాహల్, అర్ష్‌దీప్ సింగ్, షెపర్డ్

Trending News