IND W vs AUS W: ఏకైక టెస్టులో అదరగొట్టిన మన అమ్మాయిలు.. ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం..

IND W vs AUS W: ఆసీస్ తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ లో భారత మహిళల జట్టు అద్భుత విజయం సాధించింది. మహిళా టెస్టు క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియాపై భారత్‍కు ఇదే తొలి గెలుపు కావడం విశేషం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 24, 2023, 03:21 PM IST
IND W vs AUS W: ఏకైక టెస్టులో అదరగొట్టిన మన అమ్మాయిలు.. ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం..

India Women vs Australia Women Test Match: ఆస్ట్రేలియాతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ లో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆసీస్ వుమెన్స్ టీమ్ పై టీమిండియా వుమెన్స్ జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మహిళా టెస్టు క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియాపై భారత్‍కు ఇదే తొలి విజయం. 

నాలుగో రోజు ఆట ఆరంభించిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 261 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్ తహ్లియా మెక్‍గ్రాత్ (73) హాఫ్ సెంచరీ చేశారు. అయితే భారత్ ముందు 75 పరుగుల స్వల్ప లక్ష్యాన్నే మాత్రమే ఉంచింది కంగూరు జట్టు. టీమిండియా స్టార్ బౌలర్ స్నేహ్ శర్మ నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. రాజేశ్వరి గైక్వాడ్, హర్మన్‍ప్రీత్ కౌర్ చెరో రెండు వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాసించారు. దీంతో స్వల్ప లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలోనే ఛేదించింది.షెఫాలీ వర్మ (4), రిచా ఘోష్ (13) త్వరగానే ఔటైనప్పటికీ.. జెమీమా రోడ్రిగ్స్ (12 నాటౌట్) అండతో స్మృతి మంధాన (38 నాటౌట్) జట్టుకు విజయాన్ని అందించింది  

Also read: Ind vs SA Test Series: సఫారీ గడ్డపై ఇక టెస్ట్ సిరీస్, ఇద్దరు మినహా సీనియర్లతో టీమ్ ఇండియా రెడీ

ముంబై వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో మెుదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 219 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లవో పూజా వస్త్రాకర్ నాలుగు, స్నేహ్ రాణా మూడు వికెట్లతో రాణించారు. దీప్తి శర్మ (78), జెమీమా రోడ్రిగ్స్ (73), రిచా ఘోష్ (52) హాఫ్ సెంచరీలతో సత్తా చాటడంతో తొలి ఇన్నింగ్స్‌లో 406 రన్స్ చేసింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 261 పరుగులు ఆలౌటైంది. దీంతో భారత్‍ ముందు 75 పరుగుల లక్ష్యం ఉంచింది. దానిని టీమిండియా సునాయసంగా ఛేదించింది. 

Also Read: Year Ender 2023: మహిళా ప్లేయర్‌కు ముద్దు.. మ్యాథ్యూస్ టైమ్ ఔట్.. ఈ ఏడాది క్రీడల్లో అతిపెద్ద వివాదాలు ఇవే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News