Ind vs Aus 3rd test Day 4: ఆస్ట్రేలియాతో జరుగుతన్న మూడో టెస్టులో టీమిండియా ఫాలో ఆన్ డే ప్రమాదంలో పడింది.ఒకవేళ ఫాలో అన్ ఆడాల్సి వస్తే ఆస్ట్రేలియా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇంట్రెస్టింగ్ మారింది. 4వ రోజు లంచ్ సమయానికి తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్లకు 167 రన్స్ చేసింది. ఆస్ట్రేలియా కంటే ఇంకా 278 పరుగులు వెనకబడి ఉంది. ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే కనీసం 79 పరుగులు చేయాలి. ఈ నేపథ్యంలో జడేజా, నితీష్ కుమార్ రెడ్డి పైనే టీమ్ ఆశలు పెట్టుకుంది.
తరచుగా వర్షం అడ్డుతగులుతుండటంతో బ్రిస్బేన్ టెస్టు నాలుగోరోజు ఆట తొలి సెషన్ కు కూడా వరణుడు ఆటంకం కలిస్తున్నాడు. మూడో రోజు తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియా 4 రోజు తొలి సెషన్ లో మరో 2 వికెట్లు కోల్పోయింది. తొలిఇన్నింగ్స్ లో 445 పరుగులు చేసింది. భారత్ కు ఫాలో ఆన్ తప్పాలంటే 246 పరుగులు చేయాల్సి ఉంది.
ఎంసీసీ చట్టం ప్రకారం ఫాలో ఆన్ రూల్ గురించి స్పష్టత ఉంది. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టుకు మాత్రమే ఫాలో ఆన్ పై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఉదాహరణకు ఇప్పుడు ఆస్ట్రేలియా 445 పరుగులు చేసింది. ఒకవేళ భారత్ తొలి ఇన్నింగ్స్ 246 పరుగులు చేయకపోతే ఫాలో ఆన్ లో పడింది. కానీ భారత్ కు రెండో ఇన్నింగ్స్ కోసం బ్యాటింగ్ కు ఆహ్వానించాలా వద్దా అనేది ఆస్ట్రేలియా పై ఆధారపడి ఉంది. అలా కాకుండా రెండో ఇన్నింగ్స్ ను ఆసీస్ ఆడాలని నిర్ణయం తీసుకునే ఛాన్స్ లేదు.
Also Read: Rupee: రూపాయి గింగిరాలు..ఆల్‌టైమ్ కనిష్ఠానికి దేశీయ కరెన్సీ..మరో 11 పైసలు పతనం
పిచ్ బౌలింగ్ కు అనుకూలించడంతోపాటు తమ బౌలర్లు సిద్ధంగా ఉన్నారనుకుంటే ఫాలో ఆన్ ఆడించేందుకు ఆస్ట్రేలియా సిద్ధపడుతుంది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ ను 200 పరుగుల్లోపే ఆలౌట్ చేస్తే..ఇన్నింగ్స్ తేడాతో ఆసీస్ గెలిచినట్లే అలాకాకుండా భారత్ తొలి ఇన్నింగ్స్ లో 246 రన్స్ కంటే ఎక్కువ చేసిందనకుంటే తప్పనిసరిగా ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్స్ కు రావాల్సిందే. నిర్దేశించిన లక్ష్యం కోసం భారత్ ఆలౌట్ చేయాల్సి ఉంటుంది. వర్షం ఆటంకం కలిగిస్తున్న క్రమంలో భారత్ ఫాలో ఆన్ గండం దాటేస్తే మ్యాచ్ ను డ్రా చేసుకునేందుకు మంచి ఛాన్స్ దక్కుతుంది.
Also Read: Gold Rate Today: శుభవార్త..మరోసారి తగ్గిన బంగారం ధర..తులం ఎంత తగ్గిందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter