IND vs NZ 1st Test Day 3: కాన్పూర్ టెస్టు.. 296 పరుగులకు న్యూజిలాండ్ ఆలౌట్

IND vs NZ 1st Test Day 3: కాన్పూర్ వేదికగా టీమ్ఇండియా​తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్​లో న్యూజిలాండ్ జట్టు 296 పరుగులకు ఆలౌటైంది. టీమ్ఇండియా బౌలర్లలో అక్షర్ పటేల్ 5, అశ్విన్ 3 వికెట్లతో మెరిశారు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగిన టీమ్ఇండియా వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 27, 2021, 05:16 PM IST
    • తొలి ఇన్నింగ్స్ లో 296 పరుగులు ఆలౌటైన న్యూజిలాండ్
    • రెండో ఇన్నింగ్స్ లో 14 పరుగులు రాబట్టిన టీమ్ఇండియా
    • ఐదు వికెట్లు పడగొట్టిన అక్షర్ పటేల్
IND vs NZ 1st Test Day 3: కాన్పూర్ టెస్టు.. 296 పరుగులకు న్యూజిలాండ్ ఆలౌట్

IND vs NZ 1st Test Day 3: టీమ్ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్​లో న్యూజిలాండ్ 296 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా మొదటి ఇన్నింగ్స్​లో భారత్​కు 49 పరుగుల ఆధిక్యం లభించింది. తన స్పిన్ మాయాజాలంతో స్పిన్నర్ అక్షర్ పటేల్ న్యూజిలాండ్ జట్టును అడ్డుకున్నాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ కు వచ్చిన టీమ్ఇండియా శుభ్ మన్ గిల్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది.  

అంతకుముందు ఓవర్​నైట్ స్కోర్ 129 వద్ద మూడో రోజు ఆట కొనసాగించిన న్యూజిలాండ్​ లంచ్ సమయానికి రెండు వికెట్లు కోల్పోయింది. తొలి రోజు భారత బౌలర్లపై ఆధిపత్యం చలాయించి ధీటుగా పరుగులు చేసిన ఓపెనర్ విల్ యంగ్​ (89)ను అశ్విన్ పెవీలియన్ చేర్చాడు. తర్వాత మరో ఓపెనర్ లాథమ్​ (95)ను బోల్తా కొట్టించాడు అక్షర్ పటేల్. అనంతరం ఏ ఒక్క కివీస్ బ్యాట్స్​మెన్ సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. కెప్టెన్ విలియమ్సన్ (18), టేలర్ (11), జేమిసన్ (23), నికోలస్ (2), బ్లండెల్ (13), రచిన్ రవీంద్ర (13) వరుసగా పెవిలియన్ చేరారు. దీంతో తొలి ఇన్నింగ్స్​లో 296 పరుగులకు పరిమితమై 49 పరుగుల ఆధిక్యాన్ని టీమ్ఇండియా​కు కివీస్ జట్టు అప్పగించింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 5 వికెట్లతో కివీస్​ నడ్డివిరవగా.. అశ్విన్ 3, జడేజా, ఉమేష్ యాదవ్ చెరో వికెట్ సాధించారు. ​

వెలుతురు లేమి కారణంగా మూడో రోజు ఆట త్వరగానే ముగిసిపోయింది. ఈ సమయానికి టీమ్ఇండియా ఒక వికెట్ నష్టపోయి 14 పరుగులు చేసింది. గిల్ (1) రెండో ఓవర్లోనే పెవిలియన్ చేరగా.. పుజారా (9*), మయాంక్ (4*)క్రీజులో ఉన్నారు. ప్రస్తుతానికి కివీస్​పై 63 పరుగుల ఆధిక్యంలో ఉంది టీమ్ఇండియా.  

Also Read: KS Bharat: వచ్చీరాగానే సూపర్ క్యాచ్ అందుకున్న కేఎస్ భరత్.. రహానేని ఒప్పించి మరీ (వీడియో)!

Also Read: Krunal Pandya: సంచల నిర్ణయం తీసుకున్న కృనాల్‌ పాండ్యా.. గుడ్‌బై చెప్పేశాడు!!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News