పుణె: మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా నేడు ప్రారంభం కానున్న రెండో టెస్ట్‌లో టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్ తరపున రోహిత్ శర్మ, మయంక్ అగర్వాల్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. విశాఖపట్టణం వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
తొలి టెస్ట్‌లో ఓడిపోయిన సౌతాఫ్రికా.. ఈసారి గెలిచి విజయావకాశాలను సజీవం చేసుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టులో హనుమ విహారీ స్థానంలో ఉమేశ్ యాదవ్ ఆడనుండగా సౌతాఫ్రికా జట్టులో డెన్ పీడిట్ స్థానంలో అన్రిచ్ నోర్జ్టే రానున్నాడు.
భారత జట్టు ఆటగాళ్లు: రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, వృద్ధిమాన్ సాహా(కీపర్), రవిచంద్రన్ అశ్విన్, ఇశాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ.
సౌతాఫ్రికా జట్టు ఆటగాళ్లు: డీన్ ఎల్గర్, ఎయిడెన్ మార్క్రమ్, థెయునిస్ డి బ్రెయిన్, తెంబా బావుమ, డుప్లెసిస్(కెప్టెన్), క్వింటన్ డి కాక్(కీపర్), సెనురన్ ముత్తుస్వామి, వెర్నార్ ఫిలాందర్, కేశవ్ మహారాజ్, కగిసో రబడా, అన్రిచ్ నోర్జ్టే.