Ind vs SA: ఇండియా దక్షిణాఫ్రికా రెండో మ్యాచ్ కూడా వర్షార్పణం కానుందా, పొంచి ఉన్న వర్షముప్పు

Ind vs SA: ఇండియా దక్షిణాఫ్రికా తొలి టీ20 మ్యాచ్ వర్షార్పణమైంది. ఇవాళ రెండవ టీ20 మ్యాచ్‌పై కూడా మేఘాలు కమ్ముకుంటున్నాయి. మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు టీమ్ ఇండియా తుది జుట్టు ఎలా ఉంటుందో పరిశీలిద్దాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 12, 2023, 09:55 AM IST
Ind vs SA: ఇండియా దక్షిణాఫ్రికా రెండో మ్యాచ్ కూడా వర్షార్పణం కానుందా, పొంచి ఉన్న వర్షముప్పు

Ind vs SA: వన్డే ప్రపంచకప్ తరువాత టీమ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సిరీస్ విజయవంతంగా ముగిసింది. ఈ సిరీస్ ముగిసి వెంటనే సఫారీల గడ్డపై ప్రారంభమైన దక్షిణాఫ్రికా ఇండియా సిరీస్‌పై మేఘాలు ఆవహించడంతో సిరీస్ మొత్తం అనుమానాస్పదంగా మారింది. ఇవాళైనా రెండవ టీ20 జరుగుతుందా అనేది ప్రశ్నార్దకంగా మారుతోంది. 

ఇండియా దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఆటంకాలు ఎదురౌతున్నాయి. స్వదేశంలో ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ చేజిక్కించుకున్న టీమ్ ఇండియా సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు వెళ్లింది. రెండ్రోజుల క్రితం అంటే డిసెంబర్ 10 జరగాల్సిన మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా జరగలేదు. డర్బన్‌లో ఈ మ్యాచ్‌కు కనీసం టాస్ ప్రక్రియ కూడా చోటుచేసుకోలేదు. ఇవాళ రెండవ టీ20 మ్యాచ్ గ్వెబెరా సెయింట్ జార్జ్ పార్క్‌లో జరగనుంది. ఇక్కడ కూడా మేఘాలు ఆవరించి ఉండటంతో ఇదైనా జరుగుతుందా అనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. వర్షం ముప్పు పొంచి ఉండటంతో రెండవ టీ20 కూడా వర్షార్పణం కావచ్చని అంటున్నారు. ఇవాళ గ్వెబెర్రాలో కూడా 83 శాతం వర్షం పడే అవకాశాలున్నాయని యాక్యూవెదర్ అంచనా వేస్తోంది. అందుకే మ్యాచ్ ప్రారంభమౌతుందా లేక ఒకవేళ ప్రారంభమైనా ఆగిపోతుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. 

దక్షిణాఫ్రికా ఇండియా సిరీస్‌లో మూడు టీ20 మ్యాచ్‌లు ఉన్నాయి. ఒక మ్యాచ్ ఇప్పటికే రద్దయింది. ఇవాళ రెండవది కూడా జరగకపోతే సిరీస్ ప్రశ్నార్ధకం కావచ్చు. మరోవైపు మ్యాచ్ జరిగితే మాత్రం సత్తా చాటేందుకు రెండు జట్లు సిద్ధమౌతున్నాయి. 

టీమ్ ఇండియా

సూర్య కుమార్ యాదవ్, శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, రింకూ సింగ్, జితేష్ శర్మ, రవీంద్ర జడేజా, ముకేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్ లేదా రవి బిష్ణోయ్, మొహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్

దక్షిణాఫ్రికా

మార్క్‌రమ్, హెండ్రిక్స్, బ్రీట్జ్ కే, స్టబ్స్ లేదా క్లాసెన్, మిల్లర్, ఫెరీరా, జాన్సెన్ లేదా ఫెలుక్‌వాయో, కేశవ్ మహారాజ్, కోయెట్జీ, బర్గర్, షమ్సీ

Also read: Medical Colleges: ఏపీలో రెండేళ్లలో మరో 12 వైద్య కళాశాలలు, వచ్చే ఏడాది నుంచి కొత్తగా 850 మెడికల్ సీట్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News