2వ వన్డే కోసం కోహ్లి సేన కసరత్తు.. పర్యవేక్షిస్తున్న రవిశాస్త్రి

5 వన్డేల సిరీస్ కోసం ప్రస్తుతం న్యూజీలాండ్‌లో పర్యటిస్తున్న టీమిండియా తొలి వన్డేలో అద్భుతమైన విజయం సొంతం చేసుకుని సిరీస్‌‌లో పై చేయి సాధించిన సంగతి తెలిసిందే.

Last Updated : Jan 25, 2019, 02:01 PM IST
2వ వన్డే కోసం కోహ్లి సేన కసరత్తు.. పర్యవేక్షిస్తున్న రవిశాస్త్రి

5 వన్డేల సిరీస్ కోసం ప్రస్తుతం న్యూజీలాండ్‌లో పర్యటిస్తున్న టీమిండియా తొలి వన్డేలో అద్భుతమైన విజయం సొంతం చేసుకుని సిరీస్‌‌లో పై చేయి సాధించిన సంగతి తెలిసిందే. రేపు జరగనున్న రెండో వన్డేలోనూ గెలిచి మరింత ఆధిక్యం ప్రదర్శించాలని కోహ్లి సేన భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా టీమిండియా కోచ్ రవిశాస్త్రి పర్యవేక్షణలో మౌంట్ మాంగనుయిలో ఆటగాళ్లు 2వ వన్డే కోసం ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. ఆటగాళ్ల ప్రాక్టీస్ సెషన్‌ను రవిశాస్త్రి  దగ్గరుండి పర్యవేక్షిస్తుండగా ఆ పక్కనే మాజీ కెప్టేన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని నిలబడి చూస్తుండటాన్ని ఈ ఫోటోలో గమనించొచ్చు.

 

ఇదిలావుంటే, టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీ 2వ, 3వ వన్డేలకు నేతృత్వం వహించిన అనంతరం విశ్రాంతి తీసుకోనుండగా.. ఆ తర్వాత జరిగే చివరి రెండు వన్డేలతోపాటు టీ20 సిరీస్‌కి సైతం రోహిత్ శర్మ కెప్టేన్సీ బాధ్యతలు అందుకోనున్నాడు.

 

Trending News