PR Sreejesh Award: భారత హాకీ పురుషుల జట్టు గోల్ కీపర్ శ్రీజేష్ కు అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు శ్రీజేష్ ఎంపికయ్యాడు. ఇటీవలే టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్న భారత హాకీ జట్టులో అతడు కీలకపాత్ర పోషించాడు. అయితే ఇండియా నుంచి ఈ అవార్డుకు ఎంపికైన రెండో హాకీ ప్లేయర్ గా శ్రీజేష్ నిలిచాడు. అతడి కంటే ముందు ఈ అవార్డుకు మహిళల హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్ ఈ ఘనత సాధించింది.
ఈ అవార్డు కోసం శ్రీజేష్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరికొంతమంది క్రీడాకారులు రేసులో నిలిచాడు. స్పెయిన్ కు చెందిన అల్బెర్టో గినస్ లోపెజ్, వుషూ ప్లేయర్ మిచెల్ గియోర్డానో (ఇటలీ) పోటీపడ్డారు.
Congratulations to @16Sreejesh for winning the @TheWorldGames Athlete Of The Year 2021. The @TheHockeyIndia stopper received 127,647 votes, almost twice as many as the second placed athlete, Spain’s Sport Climbing ace Albert Ginés López, who garnered 67,428 votes.
More details 👇— International Hockey Federation (@FIH_Hockey) January 31, 2022
వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కోసం జరిగిన ఆన్ లైన్ ఓటింగ్ లో భారత పురుషుల హాకీ జట్టుకు చెందిన శ్రీజేష్ కు 1,27,647 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా.. అల్బెర్టో గినస్ లోపెజ్ కు 67,428 ఓట్లు, మిచెల్ గియోర్డానోకు 52,046 ఓట్లు లభించాయి.
Also Read: Rafael Nadal Wife Photos: టెన్నిస్ ఛాంపియన్ రఫెల్ నాదల్ భార్యను ఎప్పుడైనా చూశారా?
Also Read: IPL 2022 Auction: 'తప్పలేదు మరి.. శుభ్‌మన్ గిల్‌ను కోల్పోవడం బాధగా ఉంది'
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook