ఐపీఎల్ పదకొండో సీజన్ ముగిసింది. సిలికాన్ వ్యాలీ బెంగళూరులో శని, ఆదివారాల్లో రెండు రోజులపాటు జరిగిన వేలంలో మొత్తం 169 మంది క్రికెట్ ఆటగాళ్లు అమ్ముడైపోయారు. వీరిలో 56 మంది దేశీయ క్రికెటర్లు ఉన్నారు.
ఈసారి క్రికెట్ వేలంలో అంచనాలు తలకిందులయ్యాయి. ఊహించని విధంగా క్రికెటర్లు అమ్ముడైపోయారు. ఐపీఎల్ చరిత్రలోనే ఈ సీజన్ ఖరీదైన ఐపీఎల్ గా రికార్డులోకి ఎక్కింది. 11వ ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ నిలిచాడు. 12.5 కోట్లతో రాజస్థాన్ రాయల్స్ అతన్ని సొంతం చేసుకుంది. భారత పేసర్ జైదేవ్ ఉనద్కత్‌ను కూడా 11.5 కోట్లతో అదే జట్టు సొంతం చేసుకొని ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ సీజన్‌లో అత్యధిక ధరకు అమ్ముడైపోయిన దేశీయ ఆటగాడు కూడా జైదేవే..!!
ఏఏ జట్టులో ఎవరు ఉన్నారు?
హైదరాబాద్ సన్ రైజర్స్ ఆటగాళ్లు: వార్నర్ (12.5 కోట్లు), భువనేశ్వర్ (8.5 కోట్లు), పాండే (11కోట్లు), ధావన్ (9కోట్లు), సాహా (5కోట్లు), కౌల్ (3.8కోట్లు), హుడా (3.6కోట్లు), అహ్మద్ (3కోట్లు), సందీప్ శర్మ (3కోట్లు), యూసుఫ్ పఠాన్ (కోటి 90 లక్షలు), గోస్వామి (కోటి), థంపి (95లక్షలు), నటరాజన్ (40 లక్షలు), సచిన్ బేబీ (20లక్షలు), బిపుల్ (20లక్షలు), హసన్ (20లక్షలు), భుయ్ (20లక్షలు), తన్మయ్ (20 లక్షలు ), రషీద్ (9కోట్లు), విలియమ్సన్ (3కోట్లు), బ్రాత్‌వైట్ (2కోట్లు), షకిబ్ (2కోట్లు), నబి (కోటి), జోర్డాన్ (కోటి), స్టాన్‌లేక్ (50 లక్షలు).
చెన్నై సూపర్ సింగ్స్ ఆటగాళ్లు: ధోని (15కోట్లు), రైనా (11కోట్లు), జడేజా (7కోట్లు), జాదవ్ (7.8కోట్లు), కర్ణ్ (5కోట్లు), శార్దూల్ (2.6కోట్లు), రాయుడు (2.2కోట్లు), విజయ్ (2కోట్లు), హర్భజన్ (2కోట్లు), చాహర్ (80 లక్షలు), అసిఫ్ (40 లక్షలు), జగదీశన్ (20 లక్షలు), కనిష్క్ (20లక్షలు), మోను (20లక్షలు), షోరే (20లక్షలు), క్షితిజ్ (20లక్షలు), చైతన్య (20లక్షలు), డ్వేన్ బ్రావో (6.4కోట్లు), వాట్సన్ (4కోట్లు), డుప్లెసిస్ (1.6కోట్లు), వుడ్ (1.5కోట్లు), బిల్లింగ్స్ (కోటి), తాహిర్ (కోటి), శాంట్నర్ (50లక్షలు), ఎంగిడి (50లక్షలు)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు: కోహ్లి (17కోట్లు), డివిలియర్స్ (11కోట్లు), సర్ఫరాజ్ (3కోట్లు), చాహల్ (6కోట్లు), ఉమేశ్ (4.2కోట్లు), సుందర్ (3.2కోట్లు), సైని (3కోట్లు), సిరాజ్ (2.6కోట్లు), ఎం.అశ్విన్ (2.2కోట్లు), పార్థివ్ (కోటి 70 లక్షలు), మన్‌దీప్ (కోటి 40 లక్షలు), వోహ్రా (కోటి 10 లక్షలు), నేగి (కోటి), కుల్వంత్ (85లక్షలు), అనికేత్ (30లక్షలు), దేశ్‌పాండే (20లక్షలు), అనిరుధ్ జోషి (20లక్షలు), వోక్స్ (7.4కోట్లు), మెక్‌కలమ్ (3.6కోట్లు), డికాక్ (2.8కోట్లు), కౌల్టర్‌నైల్ (2.2కోట్లు), గ్రాండ్‌హోమ్ (2.2కోట్లు), మొయిన్ (కోటి 70 లక్షలు), సౌథీ (కోటి)
దిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాళ్లు: పంత్ (15కోట్లు), మోరిస్ (11కోట్లు) అయ్యర్ (7కోట్లు), మిశ్రా (4కోట్లు), నదీమ్ (3.2కోట్లు), శంకర్ (3.2కోట్లు), తెవాటియా (3కోట్లు), షమి (3కోట్లు), గంభీర్ (2.8కోట్లు), నమన్ (1.4కోట్లు), షా (1.2కోట్లు), గుర్‌కీరత్ (75లక్షలు), అవేశ్ (70 లక్షలు), అభిషేక్ (55లక్షలు), జయంత్ (50లక్షలు), హర్షల్ (20లక్షలు), కల్రా (20లక్షలు), ఘోష్ (20లక్షలు), మాక్స్‌వెల్ (9కోట్లు), రబాడ (4.2కోట్లు), బౌల్ట్ (2.2కోట్లు), మన్రో (కోటి 90 లక్షలు) క్రిస్టియన్ (కోటి 50 లక్షలు), రాయ్ (కోటి 50 లక్షలు), లమిచానె (20లక్షలు)
రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు: స్మిత్ (12.5కోట్లు), ఉనద్కత్ (11.5కోట్లు), శాంసన్ (8కోట్లు), కె.గౌతమ్ (6.2కోట్లు), రహానె (4కోట్లు), త్రిపాఠి (3.4కోట్లు), ధవల్ (75లక్షలు), బిన్నీ (50 లక్షలు), అనురీత్ (30 లక్షలు), విక్రమ్ బిర్లా (30 లక్షలు), ఎస్.మిథున్ (20 లక్షలు), గోపాల్ (20 లక్షలు), ప్రశాంత్ (20 లక్షలు), జతిన్ (20 లక్షలు), అంకిత్ శర్మ (20 లక్షలు), లొమ్రార్ (20 లక్షలు), స్టోక్స్ (12.5కోట్లు), ఆర్చర్ (7.2కోట్లు), బట్లర్ (4.4కోట్లు), షార్ట్ (4కోట్లు), లాగ్లిన్ (50 లక్షలు), చమీర (50 లక్షలు), పక్తీన్ (60లక్షలు)
ముంబయి ఇండియన్స్ ఆటగాళ్లు: రోహిత్ (15కోట్లు), హార్దిక్ (11కోట్లు), బుమ్రా (7కోట్లు), కృనాల్ (8.8 కోట్లు), కిషన్ (6.2కోట్లు), సూర్యకుమార్ (3.2కోట్లు), చాహర్ (కోటి 90 లక్షలు), సంగ్వాన్ (కోటి 50 లక్షలు), సౌరభ్ తివారి (80 లక్షలు), తేజిందర్ (55 లక్షలు), దినేశన్ (20 లక్షలు), తారె (20 లక్షలు), లాడ్ (20 లక్షలు), మార్కండె (20 లక్షలు), లుంబా (20 లక్షలు), అనుకుల్ (20 లక్షలు), మోసిన్ (20 లక్షలు), పొలార్డ్ (5.4కోట్లు), కమిన్స్ (5.4కోట్లు), లూయిస్ (3.8కోట్లు), కటింగ్ (2.2కోట్లు), ముస్తాఫిజుర్ (2కోట్లు), బెరెన్‌డార్ఫ్ (కోటి 50 లక్షలు), డుమిని (కోటి), ధనంజయ (50 లక్షలు)
కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లు: నరైన్ (12.5కోట్లు), రసెల్ (8.5కోట్లు), దినేశ్ కార్తీక్ (7.4కోట్లు), ఉతప్ప (6.4కోట్లు), కుల్‌దీప్ (5.8కోట్లు), చావ్లా (4.2కోట్లు), రాణా (3.4కోట్లు), నాగర్‌కోటి (3.2కోట్లు), మావి (3.2కోట్లు), శుభ్‌మన్ (కోటి 80 లక్షలు), వినయ్ కుమార్ (కోటి), రింకు (80 లక్షలు) అపూర్వ్ (20 లక్షలు), జగ్గి (20 లక్షలు), లిన్ (9.6కోట్లు), స్టార్క్ (9.4కోట్లు ), జాన్సన్ (2 కోట్లు ), డెల్‌పోర్ట్ (30 లక్షలు), సీర్‌లెస్ (30 లక్షలు)
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాళ్లు: అక్షర్ (12.5 కోట్లు), రాహుల్ (11కోట్లు), అశ్విన్ (7.6కోట్లు), కరుణ్ (5.6కోట్లు), అంకిత్ రాజ్‌పుత్ (3కోట్లు), మోహిత్ (2.కోట్లు), శరణ్ (2.2కోట్లు), యువరాజ్ (2 కోట్లు), అక్ష్దీప్ (కోటి), మనోజ్ (కోటి), మయాంక్ (కోటి), మంజూర్ (20 లక్షలు), సాహు (20 లక్షలు ), దాగర్ (20 లక్షలు), టై (7.2కోట్లు), ఫించ్ (6.2కోట్లు), స్టాయినిస్ (6.2కోట్లు), ముజీబ్ (4కోట్లు), మిల్లర్ (3కోట్లు), గేల్ (2కోట్లు), డ్వార్షుస్ (కోటి 40 లక్షలు)