ఐపీఎల్ 11వ సీజన్ షెడ్యూల్ వచ్చేసిందోచ్!!

ఐపీఎల్ 11వ సీజన్ షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ 

Last Updated : Feb 14, 2018, 09:35 PM IST
ఐపీఎల్ 11వ సీజన్ షెడ్యూల్ వచ్చేసిందోచ్!!

ఐపీల్ 11వ సీజన్‌కి సంబంధించి బీసీసీఐ కీలకమైన వివరాలు ప్రకటించింది. ఏప్రిల్ 7న మొదలై మే 27వ తేదీ వరకు 51వ రోజులపాటు కొనసాగనున్న ఈ 11వ సీజన్‌లో అన్ని ఫ్రాంఛైజీలు కలిపి మొత్తం 60 మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఈ 60 మ్యాచ్‌ల కోసం వివిధ రాష్ట్రాల్లోని 9 స్టేడియాలు వేదికలు కానున్నాయి. మొట్టమొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. రెండుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ రెండేళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఐపీఎల్‌లో అడుగుపెట్టింది. మే 27న జరిగే ఫైనల్ మ్యాచ్‌కి ముంబైలోని వాంఖడే స్టేడియం వేదిక కానుంది.

 

కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు మొహాలితోపాటు ఇండోర్ స్టేడియంలను తమ హోమ్ గ్రౌండ్స్‌గా వినియోగించుకోనుండగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియాన్ని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తమ హోమ్ గ్రౌండ్‌గా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ 60 మ్యాచ్‌ల్లోని 12 మ్యాచ్‌లు సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుండగా మిగితా 48 మ్యాచ్‌లు రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్నాయి.

Trending News