SRH VS KKR: సూపర్‌ ఓవర్‌లో కోల్‌కతా బంపర్ విజయం..

ఆదివారం.. క్రికెట్.. ఈ రెండూ కలిస్తే అదిరిపోయే ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఐపీఎల్ 2020లో ( IPL 2020 ) ఇవాళ జరిగిన మ్యాచు కూడా అలాంటిదే. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ , సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఈ మ్యాచులో కేకేఆర్ టీమ్ సూపర్ ఓవర్లో నెగ్గి విజయం సాధించింది.

Last Updated : Oct 18, 2020, 11:25 PM IST
    • ఒక వైపు వార్నర్ మెరుపు బ్యాటింగ్ చేసినా..గెలుపు మాత్రం వరించలేదు.
    • స్కోర్ టై అయిన తరువాత సూపర్ ఓవర్ లో అయినా లక్కు చిక్కుతుందేమో అని హైదరాబాద్ టీమ్ ఫ్యాన్స్ భావించారు.
SRH VS KKR: సూపర్‌ ఓవర్‌లో కోల్‌కతా బంపర్ విజయం..

ఆదివారం.. క్రికెట్.. ఈ రెండూ కలిస్తే అదిరిపోయే ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఐపీఎల్ 2020లో ( IPL 2020 ) ఇవాళ జరిగిన మ్యాచు కూడా అలాంటిదే. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ , సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఈ మ్యాచులో కేకేఆర్ టీమ్ సూపర్ ఓవర్లో నెగ్గి విజయం సాధించింది. ఒక వైపు వార్నర్ మెరుపు బ్యాటింగ్ చేసినా..గెలుపు మాత్రం వరించలేదు. స్కోర్ టై అయిన తరువాత సూపర్ ఓవర్ లో అయినా లక్కు చిక్కుతుందేమో అని హైదరాబాద్ టీమ్ ఫ్యాన్స్ భావించారు. కానీ కేకేఆర్ టీమ్ విజయంతో దూసుకెళ్లింది. 

READ ALSO | Credit Charges: పేటీఎం 2 %  క్రెడిట్ చార్జీ లేకుండా డబ్బు ఇలా బదిలీ చేసుకోవచ్చు

ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ ( Kolkata Knight Riders ) టీమ్ 20 ఓవర్లలో 163 పరుగులు చేసింది. ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ శుభ్ మన్ గిల్ ( 36 పరుగులు ) మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ఇన్నింగ్స్ చివరిలో వచ్చిన ఇయాన్ మోర్గాన్, దినశ్ కార్తిక్ విరుచుకుపడటంతో కేకేఆర్ టీమ్ గౌరవప్రదమైన స్కోర్ సాధించింది.

163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ టీమ్ ( Sunrisers Hyderabad ) 20 ఓవర్లలో 163 రన్స్ చేసింది. అబుదాబి పిచ్ బ్యాటింగ్ విషయంలో కాస్త అనుకూలం అయినా..ఇరు జట్ల బ్యాట్స్ మెన్ భారీ స్కోర్లు మలచడంలో కాస్త ఇబ్బంది పడ్డారు. హైదరాబాద్ టీమ్ సారథి డేవిడ్ వార్నర్ 33 బంతుల్లో 47 పరుగులు చేసి టీమ్ విజయం కోసం చాలా ప్రయత్నించాడు. అదే సమయంలో బెయిర్ స్టో 36 రన్స్, విలియమ్సన్ 29 రన్స్, అబ్దుల్ సమద్ 23 పరుగుల చేసి విజయం కోసం ప్రయత్నించారు. ఇరు జట్ల స్కోర్ లెవల్ అవడంతో సూపర్ ఓవర్ అవసరం వచ్చింది. ఇందులో కేకేఆర్ టీమ్ విజయం సాధించింది. ఫర్గుసన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కైవసం చేసుకున్నాడు.READ ALSO | Covid-19 Vaccine: మార్చిలో 2021లోపు వ్యాక్సిన్.. సీరం ఇనిస్టిట్యూట్ క్లారిటీ

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

 

Trending News