IPL 2021: ఐపీఎల్ 2021 నిర్వహణపై BCCI అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ క్లారిటీ

IPL 2021 Latest News : ఇటీవల ఇద్దరు ఐపీఎల్ క్రికెటర్లతో పాటు మొత్తం 20 మందికి కోవిడ్-19గా తేలడంతో అనుమానాలు మొదలయ్యాయి. ఈ సీజన్ వాయిదా పడనుందని, లేదా మరోసారి విదేశాలలో నిర్వహించనున్నారా అనే చర్చ మొదలైంది.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 5, 2021, 09:33 AM IST
IPL 2021: ఐపీఎల్ 2021 నిర్వహణపై BCCI అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ క్లారిటీ

IPL 2021: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2021) నిర్వహణపై సందేహాలకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెక్ పెట్టాడు. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ఐపీఎల్ తాజా సీజన్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశాడు. ఇటీవల ఇద్దరు ఐపీఎల్ క్రికెటర్లతో పాటు మొత్తం 20 మందికి కోవిడ్-19గా తేలడంతో అనుమానాలు మొదలయ్యాయి. ఈ సీజన్ వాయిదా పడనుందని, లేదా మరోసారి విదేశాలలో నిర్వహించనున్నారా అనే చర్చ మొదలైంది.

మహారాష్ట్ర ప్రభుత్వం వీకెండ్ లాక్‌డౌన్ ప్రకటించిన కొన్ని గంటలకే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఐపీఎల్ 2021 నిర్వహణపై స్పందించాడు. షెడ్యూల్ ప్రకారమే సీజన్ 14 నిర్వహించనున్నామని ఏఎన్ఐ మీడియాకు తెలిపారు. శుక్రవారం రాత్రి 8 గంట నుంచి సోమవారం ఉదయం 7 గంటలవరకు మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ను విధించారు. కేవలం అత్యవసర సర్వీసులు, బస్సులు, రైళ్లు, ట్యాక్సీలు లాంటి రవాణాకు అనుమతి ఇస్తున్నట్లు మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐపీఎల్ 2021(IPL 2021) ఆటగాళ్లకు వ్యాక్సిన్ ఇప్పించాలని బీసీసీఐ భావిస్తోంది.

Also Read: Gold Price Today 05 April 2021: బులియన్ మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు

బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కేంద్ర మంత్రులతో దీనిపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆటగాళ్లకు కరోనా వ్యాప్తి అనుమానాల నేపథ్యంలో వారికి టీకాలు ఇప్పించడమే తమకు కనిపిస్తున్న మార్గమని శుక్లా పేర్కొన్నాడు. కరోనా వైరస్ ప్రభావం ఎప్పుడు తగ్గుతుందో ఎవరికీ తెలియదన్నారు. కనుక ఆటగాళ్లకు కరోనా టీకాలు ఇవ్వడం సరైన నిర్ణయమని భావిస్తున్నామని ఏఎన్ఐ మీడియాకు రాజీవ్ శుక్లా వెల్లడించారు.

ఇప్పటివరకూ కేంద్ర మంత్రులతో ఆటగాళ్లకు వ్యాక్సినేషన్‌పై ఏమైనా లేఖ రాశారా అని మీడియా బీసీసీఐ ఉన్నతాధికారులను ప్రశ్నించింది. ఇప్పటివరకూ లేఖ లాంటివి రాయలేదని, అయితే కేంద్ర మంత్రులతో చర్చించి ఐపీఎల్ 2021 క్రికెటర్లకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నామని రాజీవ్ శుక్లా వివరించారు. అయితే కట్టుదిట్టమైన బయో బబుల్ వాతావరణంలో సీజన్ 14 ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించనున్నామని బీసీసీఐ(BCCI) చెబుతోంది.

Also Read: IPL 2021: ఐపీఎల్ 2021 రద్దు కానుందా, సీజన్ 14 నిర్వహణపై BCCI పునరాలోచన 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News