IPL 2022: ఐపీఎల్ 2018ని బ్రేక్ చేసిన ఐపీఎల్ 2022.. 11 మ్యాచ్‌ల్లో 1000 దాటేనా?

IPL 2022 breaks IPL 2018 Record in Most Sixes. క్యాష్ రిచ్ లీగ్‌ చరిత్రలో ఒక సీజన్‌లో అత్యధిక సిక్సర్లు నమోదైన రికార్డు ఐపీఎల్ 2022 తన పేరుపై లికించుకుంది. ఐపీఎల్ 2022లో ఇప్పటివరకు 873 సిక్సర్లు నమోదయ్యాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : May 16, 2022, 02:15 PM IST
  • ఐపీఎల్ 2018ని బ్రేక్ చేసిన ఐపీఎల్ 2022.
  • 11 మ్యాచ్‌ల్లో 1000 దాటేనా?
  • షమీ బౌలింగ్‌లో 117 మీటర్ల భారీ సిక్స్‌ర్
IPL 2022: ఐపీఎల్ 2018ని బ్రేక్ చేసిన ఐపీఎల్ 2022.. 11 మ్యాచ్‌ల్లో 1000 దాటేనా?

IPL 2022 breaks IPL 2018 Record in Most Sixes in a single IPL season: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో ఐపీఎల్ 2022 అత్యంత వినోదాత్మక సీజన్ అని చెప్పాలి. లీగ్ దశలో 10 జట్లు ఆడుతుండడంతో క్రికెట్ అభిమానులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అసాధారణమైన బ్యాటింగ్ ప్రదర్శనలు, గొప్ప బౌలింగ్ స్పెల్‌లు, అద్భుత ఫీల్డింగ్ విన్యాసాలతో 15వ సీజన్ కొనసాగుతోంది. అయితే బ్యాటర్లు ఎక్కువగా సిక్సులు కొడుతుండడంతో.. క్రికెట్ ఫాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2022 ఓ సరికొత్త రికార్డు నెలకొల్పింది. 

క్యాష్ రిచ్ లీగ్‌ చరిత్రలో ఒక సీజన్‌లో అత్యధిక సిక్సర్లు నమోదైన రికార్డు ఐపీఎల్ 2022 తన పేరుపై లికించుకుంది. ఐపీఎల్ 2022లో ఇప్పటివరకు 873 సిక్సర్లు నమోదయ్యాయి. 15వ సీజన్లో ఆదివారం వరకు 61 మ్యాచ్‌లు జరగ్గా.. బ్యాటర్లు 873 సిక్సర్లు బాదారు. ఇంతకు ముందు ఐపీఎల్ 2018 సీజన్‌లో అత్యధికంగా 872 నమోదయ్యాయి. ఈ సీజన్‌లో ఇంకా 11 మ్యాచ్‌లు మిగిలి ఉన్న నేపథ్యంలో 1000 సిక్సర్ల మార్క్‌ను అధిగమించే అవకాశం ఉంది.

ఐపీఎల్ చరిత్రలో ఓ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు నమోదైంది ఐపీఎల్ 2022లోనే. 872 సిక్సర్లతో ఐపీఎల్ 2018 సీజన్‌ రెండో స్థానంలో ఉండగా.. 784 సిక్సులతో 2019 మూడో స్థానంలో ఉంది. 2020 సీజన్లో 734 సిక్సులు, 2012 సీజన్లో 731 సిక్సులు నమోదయ్యాయి. ఐపీఎల్ చరిత్రలో ఓ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్ 5 జాబితాలో 2022, 2018, 2019, 2022, 2021 ఉన్నాయి.    

ఐపీఎల్‌ 2022లో లాంగెస్ట్ సిక్స్ కొట్టిన ఆటగాడిగా పంజాబ్‌ కింగ్స్‌ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్ నిలిచాడు. గుజరాత్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ బౌలింగ్‌లో 117 మీటర్ల భారీ సిక్స్‌ర్ బాదాడు. అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముఖేష్ చౌదరి బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్ 108 మీటర్ల సిక్స్ కూడా కొట్టాడు. జూనియర్‌ డివిల్లియ‌ర్స్‌గా పేరున్న డెవాల్డ్ బ్రెవిస్ 112 మీటర్ల భారీ సిక్స్‌ర్ బాది 15వ  సీజన్లో రెండో భారీ సిక్స్ కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. 

ఇక ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత దూరం సిక్సర్ బాదిన ఆటగాడిగా విండీస్ హిట్టర్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ రికార్డుల్లో నిలిచాడు. 2013లో గేల్ 119 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. 2016లో బెన్ కట్టింగ్ 117 మీటర్ల సిక్సర్ బాది ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. లియామ్ లివింగ్‌స్టోన్ (117), డెవాల్డ్ బ్రెవిస్ (112), క్రిస్ గేల్ (112), ఎంఎస్ ధోనీ (112), ఏబీ డివిల్లియ‌ర్స్‌ (111), ఎంఎస్ ధోనీ (111), ఏబీ డివిల్లియ‌ర్స్‌ (111), క్రిస్ గేల్ (111), డేవిడ్ మిల్లర్ (110) ఈ జాబితాలో వరుసగా ఉన్నారు. 

Alos Read: Samantha-Vijay devarakonda: ఖుషి టైటిల్‌తో వస్తున్న సమంత, విజయ్‌.. ఫస్ట్‌లుక్‌ అదిరిపోయింది!

Also Read: F3 Movie: పోరితో సల్సా, రాత్తిరంతా జల్సా.. 'ఎఫ్‌ 3' స్పెష‌ల్ సాంగ్ ప్రోమో విడుద‌ల‌! పూజా హెగ్డే స్టెప్స్‌ అదుర్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News