Megastar Chiranjeevi: చిరంజీవి సినిమాలో స్టార్ డైరెక్టర్.. పవర్ ఫుల్ పాత్రలో..

Puri Jagannadh act in Chiranjeevi's Godfather Movie. 'గాడ్‌ ఫాదర్‌' సినిమాలో తెలుగు స్టార్‌ డైరక్టర్‌ పూరి జగన్నాథ్‌ కూడా ఓ పాత్ర పోషించబోతున్నారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 9, 2022, 12:24 PM IST
  • చిరంజీవి సినిమాలో స్టార్ డైరెక్టర్
  • జర్నలిస్టు పాత్రలో పూరి జగన్నాథ్‌
  • విజయ్ దేవరకొండతో రెండో సినిమా
Megastar Chiranjeevi: చిరంజీవి సినిమాలో స్టార్ డైరెక్టర్.. పవర్ ఫుల్ పాత్రలో..

Puri Jagannadh to play a special role in Chiranjeevi's Godfather Movie: టాలీవుడ్ మెగాస్టార్‌ చిరంజీవి, డైరెక్టర్ మోహన్‌రాజా కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం 'గాడ్‌ ఫాదర్‌'. మలయాళ హిట్‌ మూవీ 'లూసీఫర్‌'కు  ఇది రీమేక్‌ అన్న విషయం తెలిసిందే. చిరంజీవి 153వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన షూటింగ్‌ను పూర్తి చేయగా.. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ వంతు వచ్చింది. 

'గాడ్‌ ఫాదర్‌' సినిమాలో తెలుగు స్టార్‌ డైరక్టర్‌ పూరి జగన్నాథ్‌ కూడా ఓ పాత్ర పోషించబోతున్నారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. 'నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు వెండితెరపై నటుడిగా ఓ వెలుగువెలగాలని హైదరాబాద్ వచ్చాడు. ఒకటి అరా వేషాలు వేసాడు. ఇంతలో కాలం చక్రం తిప్పింది.. స్టార్ డైరెక్టర్ అయ్యాడు. కానీ అతని మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా.. అందుకే గాడ్‌ ఫాదర్‌ సినిమాలో ఓ స్పెషల్‌ రోల్‌ చేస్తున్నాడు' అని చిరు ట్వీట్ చేశారు. 

చిరంజీవి పోస్ట్ చేసిన ట్వీటులో మెగాస్టార్, పూరి జగన్నాథ్‌ ఇద్దరు పుష్పగుచ్చాలు పట్టుకుని ఉన్నారు. మరో ఫొటోలో వీరితో పాటుగా ఛార్మి కౌర్ కూడా ఉన్నారు. ఈరోజు నుంచి షూటింగ్‌లో పాల్గొననున్న పూరి.. వారాంతంలోపు తన పార్ట్ షూటింగ్ పూర్తి చేస్తారని సమాచారం. ప్రస్తుతానికి ఆయన ఎలాంటి పాత్ర పోషిస్తారన్న విషయంపై కొంత సస్పెన్స్ నెలకొంది. అయితే 'గాడ్‌ ఫాదర్‌' సినిమాలో పూరి జగన్నాథ్‌ ఓ జర్నలిస్టు పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం తెలుస్తోంది. 

'గాడ్‌ ఫాదర్‌' సినిమాలో సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను ఐదు భాషల్లో ఈ ఏడాది ఆగస్టు 11న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. మరోవైపు పూరి జగన్నాధ్ 'లైగర్' పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. త్వరలో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో 'జనగణమన' షూటింగ్‌ను కూడా ప్రారంభించనున్నారు. విజయ్ దేవరకొండతో పూరికి ఇది రెండో సినిమా. 

Also Read: Mannava Balayya Passes Away: సీనియర్ నటుడు బాలయ్య కన్నుమూత.. పుట్టినరోజునే మృతి!

Also Read: Sri Rama Navami 2022: శ్రీరామ నవమి పూజా ముహూర్తం, విధివిధానాలు ఏంటో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News