Ashish Nehra IPL Record: ఆశిష్ నెహ్రా అరుదైన రికార్డు.. తొలి ఇండియన్‌గా..!

Ashish Nehra Becomes First Indian Head Coach To Win IPL Trophy. గుజరాత్ టైటాన్స్ ప్రధాన కోచ్‌, టీమిండియా మాజీ లెఫ్టార్మ్ పేసర్ ఆశిష్ నెహ్రా ఓ అరుదైన రికార్డ్ సాధించాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 30, 2022, 05:19 PM IST
  • ఆశిష్ నెహ్రా అరుదైన రికార్డు
  • తొలి ఇండియన్‌గా ఆశిష్ నెహ్రా
  • అరంగేట్రం సీజన్‌లో టైటిల్‌ కొట్టి
Ashish Nehra IPL Record: ఆశిష్ నెహ్రా అరుదైన రికార్డు.. తొలి ఇండియన్‌గా..!

Gujarat Titans head coach Ashish Nehra Becomes First Indian Head Coach To Win IPL Trophy: ఐపీఎల్ 2022 టైటిల్‌ను గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం (మే 29) రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో గుజరాత్ 7 వికెట్ల తేడాతో గెలుపొంది.. అరంగేట్రం చేసిన తొలి సీజన్లోనే టైటిల్ ఎగరేసుకుపోయింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి అరంగేట్రం సీజన్‌లో టైటిల్‌ కొట్టి గుజరాత్‌ చరిత్ర సృష్టించింది. మరోవైపు 14 ఏళ్ల తర్వాత తుది పోరుకు అర్హత సాధించిన రాజస్తాన్‌కు భంగపాటు తప్పలేదు. 

గుజరాత్ టైటాన్స్ ప్రధాన కోచ్‌, టీమిండియా మాజీ లెఫ్టార్మ్ పేసర్ ఆశిష్ నెహ్రా ఓ అరుదైన రికార్డ్ సాధించాడు. ఐపీఎల్ ట్రోఫీ సాధించిన హెడ్ కోచ్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఇప్పటివరకు ఏ భారత హెడ్ కోచ్ కూడా ఐపీఎల్ ట్రోఫీ అందుకోలేదు. అంతేకాదు ఐపీఎల్ చరిత్రలో ప్లేయర్‌గా, హెడ్ కోచ్‌గా ట్రోఫీ గెలిచిన వ్యక్తిగా నెహ్రా నిలిచాడు. 2016లో డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ కప్ గెలిచింది. ఆ జట్టులో నెహ్రా ఆటగాడిగా ఉన్నాడు. ఐపీఎల్ 2022లో మాత్రం గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్‌గా ఉన్నాడు. 

ఆశిష్ నెహ్రా కంటే ముందు ప్లేయర్‌గా, హెడ్ కోచ్‌గా ఇద్దరు ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఉన్నారు. రికీ పాంటింగ్, షేన్ వార్న్ ఈ ఘనత సాధించారు. 2013లో తొలిసారి కప్ కొట్టిన ముంబై ఇండియన్స్ జట్టులో పాంటింగ్ ప్లేయర్‌గా ఉండగా.. 2015లో ఆ జట్టుకు హెడ్ కోచ్‌గా ఉన్నాడు. ఇక 2008లో రాజస్థాన్ రాయల్స్ టైటిల్ గెలిచినప్పుడు వార్న్ ఆ జట్టుకు ప్లేయర్‌గా, హెడ్ కోచ్‌గా ఉన్నాడు. 

అత్యధిక ఐపీఎల్ ట్రోఫీలు సాధించిన ప్రధాన కోచ్‌ మాత్రం స్టీఫెన్ ఫ్లెమింగ్. ఫ్లెమింగ్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ఏకంగా 4 టైటిల్స్ అందించాడు. ముంబై ఇండియన్స్ జట్టుకు మహేలా జయవర్దనే 3, కోలకతా నైట్ రైడర్స్ జట్టుకు ట్రెవర్ బేలిస్ 2 ట్రోఫీలు అందించారు. ఆశిష్ నెహ్రా (గుజరాత్ టైటాన్స్), టామ్ మూడీ (సన్ రైజర్స్ హైదరాబాద్), రికీ పాంటింగ్ (ముంబై ఇండియన్స్), జాన్ రైట్ (ముంబై ఇండియన్స్), డారెన్ లెమాన్ (డెక్కన్ ఛార్జర్స్), షేన్ వార్న్ (రాజస్థాన్ రాయల్స్) ఒక్కో టైటిల్ అందించారు. 

Also Read: Hardik Pandya Celebrations: వైరల్ వీడియో.. భావోద్వేగాన్ని ఆపుకోలేక భార్యను గట్టిగా.!

Also Read: IPL 2022 Awards List: ఐపీఎల్‌ 2022 అవార్డు విజేతలు వీరే.. ఆ ఐదు అవార్డులు బట్లర్‌కే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News