IPL 2022, RCB Vs GT: గుజరాత్ విజయ పరంపర కొనసాగుతోంది. తాజాగా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. బెంగళూరు నిర్దేశించిన 171 పరుగుల లక్ష్యాన్ని మరో మూడు బంతులు ఉండగానే ఛేదించి సత్తా చాటింది హార్దిక్ సేన. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. రాహుల్ తెవాతియా (43*) డేవిడ్ మిల్లర్ (39*) అద్భుత బ్యాటింగ్ చేసి గుజరాత్ కు విజయాన్ని కట్టబెట్టారు. ఈ గెలుపుతో గుజరాత్ (16) ప్లేఆఫ్స్ బెర్తును దాదాపు ఖరారు అయినట్లే.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (58), రజత్ పాటిదార్ (52) అర్ధ శతకాలతో రాణించారు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (33) ఫర్వాలేదనిపించాడు. చివరి ఓవర్లలో గొప్పగా పుంజుకున్న గుజరాత్ బౌలర్లు వికెట్లు తీసి బెంగుళూరు స్కోరును అడ్డుకున్నారు. డుప్లెసిస్ డకౌట్ గా వెనుదిరిగాడు. గుజరాత్ బౌలర్లలో ప్రదీప్ సంగ్వాన్ 2 వికెట్లు పడగొట్టగా.. షమీ, అల్జారీ జోసెఫ్, ఫెర్గూసన్ తలో వికెట్ తీశారు.
అనంతరం బెంగళూరు విధించిన 171 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లను మాత్రమే కోల్పోయి 19.3 ఓవర్లలో పూర్తి చేసింది గుజరాత్. గుజరాత్ బ్యాటర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్య 3 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. వృద్ధిమాన్ సాహా (29), శుభ్‌మన్ గిల్ (31), సాయి సుదర్శన్ (20) రాణించారు. చివర్లో రాహుల్ తెవాతియా, డేవిడ్ మిల్లర్ మెరుపులు మెరిపించి గుజరాత్ ను విజయతీరాలకు చేర్చారు. బెంగళూరు బౌలర్లలో షాబాజ్, హసరంగ చెరో 2 వికెట్లు తీశారు.
Also Read: MS Dhoni CSK Captain: బ్రేకింగ్ న్యూస్.. చెన్నై కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.