Sunrisers Hyderabad: ఐపీఎల్ 2024 వేలం మరి కొద్దిరోజుల్లో అంటే డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా జరగనుంది. మొత్తం పది ఫ్రాంచైజీలు తమ తమ ఆటగాళ్ల రిటెన్షన్, రిలీజ్ జాబితాల్ని ప్రకటించాయి. దాదాపు అన్ని జట్లు కీలకమైన ఆటగాళ్లను పెద్దఎత్తున రిలీజ్ చేసి సంచలనానికి తెరతీశాయి. అదే క్రమంలో ఎస్‌ఆర్‌హెచ్ తీసుకున్న నిర్ణయంపై ఆ జట్టు మాజీ కోచ్ టామ్ మూడీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు.
ఐపీఎల్ 2024 వేలానికి ముందు జరగాల్సిన రిటెన్షన్ అండ్ రిలీజ్ జాబితా అందర్నీ ఆశ్చర్యపర్చింది. ఆర్సీబీ అందరికంటే అత్యధికంగా 11 మందిని రిలీజ్ చేసి దాదాపు 30 కోట్ల వరకూ వ్యాలెట్ పెంచుకుంది. ఇక సన్‌రైజర్స్ జట్టు కూడా జట్టుకు భారంగా మారిన ఆటగాళ్లను విడుదలు చేసేసింది. చెన్నై సూపర్‌కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇలా అన్ని జట్లు కీలకమైన ఆటగాళ్లను వదులుకున్నాయి. గత సీజన్‌లో ఘోరమైన ప్రదర్శన కనబర్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారి సమర్ధవంతమైన ఆటగాళ్ల కోసం చూస్తోంది. ఆశించిన స్థాయిలో ప్రదర్శన లేకుండా జట్టుకు భారంగా మారిన ఆటగాళ్లను విడుదల చేయాలని నిర్ణయించుకుంది. గత ఐపీఎల్ వేలంలో 13.25 కోట్ల భారీ ధరకు దక్కించుకున్న ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ సహా ఆదిల్ రషీద్, వివ్రాంత్ శర్మ, సమర్ధ్ వ్యాస్, కార్తీక్ త్యాగి, అకీల్ హొసేన్‌లను కూడా రిలీజ్ చేసింది. తద్వారా ఎస్ఆర్‌హెచ్ జట్టు వ్యాలెట్ 34 కోట్లకు పెంచుకుంది.
ఈసారి సమర్ధవంతమైన ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఆ డబ్బులు వెచ్చించనుంది. 13.25 కోట్లకు కొనుగోలు చేసిన హ్యారీ బ్రూక్ జట్టుకు భారంగా మారాడు. 11 మ్యాచ్‌లు ఆడి కేవలం 190 పరుగులే చేయగలిగాడు. అయితే హ్యారీ బ్రూక్‌ను వదిలించుకోవడం మంచి నిర్ణయమేనని చాలామంది చెబుతున్నా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మాజీ కోచ్ టామ్ మూడీ మాత్రం వ్యతిరేకిస్తున్నాడు. హ్యారీ బ్రూక్‌ను వదులుకుని ఎస్ఆర్‌హెచ్ తప్పు చేసిందంటున్నాడు. ఈ నిర్ణయంపై ఎస్‌ఆర్‌హెచ్ పశ్చాత్తాప పడక తప్పదంటున్నాడు. హ్యారీ బ్రూక్‌ను విడుదల చేసి తిరిగి వేలంలో అతడినే సగం ధరకే కొనాలనేది సన్‌రైజర్స్ వ్యూహం కావచ్చన్నాడు. ఈ నిర్ణయం వల్ల ఎస్‌ఆర్‌హెచ్ నష్టపోతుందన్నాడు టామ్ మూడీ. అసాధారణ ప్రతిభ ఉన్న హ్యారీ బ్రూక్ కోసం వేలంలో గట్టి పోటీ ఉంటుందంటున్నాడు.
వాస్తవానికి హ్యారీ బ్రూక్ సేవల్ని ఎస్‌ఆర్‌హెచ్ సరిగ్గా వినియోగించుకోలేకపోయిందని టామ్ మూడీ స్పష్టం చేశాడు. టీ20 క్రికెట్‌లో ఓపెనింగ్ చేయని బ్యాటర్లను టాప్ ఆర్డర్‌కు పంపించి సన్‌రైజర్స్ హైదరాబాద్ తప్పు చేసిందన్నాడు. మిడిల్ ఆర్డర్‌లో పంపించి ఉంటే బాగుండేదంటున్నాడు. ఏదేమైనా హ్యారీ బ్రూక్‌ను వదులుకున్నందుకు ఎస్‌ఆర్‌హెచ్ బాధపడాల్సి వస్తుందంటున్నాడు.
Also read: Gujarat Titans: గుజరాత్ టైటాన్స్ కొత్త కెప్టెన్‌గా శుభమన్ గిల్, వైస్ పగ్గాలు రషీద్‌కేనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook