Gujarat Titans: గుజరాత్ టైటాన్స్ కొత్త కెప్టెన్‌గా శుభమన్ గిల్, వైస్ పగ్గాలు రషీద్‌కేనా

Gujarat Titans: ఐపీఎల్ 2024 వేలానికి ముందే జరిగిన మార్పులు తీవ్ర చర్చనీయాంశమౌతున్నాయి. హార్దిక్ పాండ్యా జట్టును వదిలేయడంతో ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ కొత్త కెప్టెన్ ఎవరనే చర్చ ప్రారంభమైంది. కొత్త కెప్టెన్ విషయంలో గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 27, 2023, 02:44 PM IST
Gujarat Titans: గుజరాత్ టైటాన్స్ కొత్త కెప్టెన్‌గా శుభమన్ గిల్, వైస్ పగ్గాలు రషీద్‌కేనా

Gujarat Titans: ఐపీఎల్ 2024 సీజన్ కంటే ముందే నిన్న ముగిసిన రిటెన్షన్ ప్రక్రియ సంచలనం రేపింది. దాదాపు అన్ని ఫ్రాంచైజీలు కీలక ఆటగాళ్లను రిలీజ్ చేయగా, ఆర్ధికపరమైన కారణాలతో హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ జట్టును వదిలేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడా జట్టుకు కొత్త కెప్టెన్‌గా శుభమన్ గిల్ పేరును ఆ జట్టు ఖాయం చేసింది. 

ఐపీఎల్ 2024 వేలం కంటే ముందే గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ ప్రక్రియ ద్వారా ముంబై ఇండియన్స్‌కు వెళ్లడం సంచలనంగా మారింది. దుబాయ్ వేదికగా డిసెంబర్ 19న ఐపీఎల్ 2024 వేలం జరగనుంది. అన్ని ఫ్రాంచైజీలు నిన్న చివరి రోజున రిటెన్షన్, రిలీజ్ జాబితాలు ప్రకటించాయి. అంతకంటే ముందు ట్రేడింగ్ ప్రక్రియ ద్వారా కొన్ని జట్లు ఆటగాళ్లను మార్చుకున్నాయి. ఇందులో భాగంగానే గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా హఠాత్తుగా జీటీని వదిలి ఎంఐ రైలెక్కడం చర్చనీయాంశంగా మారింది. మరిప్పుుడు గుజరాత్ టైటాన్స్ జట్టుని నడిపించే నాయకుడు ఎవరు..కెప్టెన్సీ రేసులో అయితే శుభమన్ గిల్, రషీద్ ఖాన్, కేన్ విలియమ్సన్ పేర్లు విన్పించాయి.

రషీద్ ఖాన్ ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్న అనుభవముంది. అటు బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ఫామ్‌లో ఉన్నాడు. ఇక గుజరాత్ టైటాన్స్ ఓపెనర్, టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ శుభమన్ గిల్ కూడా రేసులో ఉన్నాడు. గుజరాత్ కొత్త కెప్టెన్ శుభమన్ గిల్ అనే వార్తలు ఎక్కువగా విన్పిస్తున్నాయి. ఇక మరోవైపు జట్టులో కొత్తగా చేరిన కేన్ విలియమ్సన్ పేరు కూడా విన్పిస్తోంది. ఎందుకంటే కేన్ విలియమ్సన్ విజయవంతమైన సారధి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. విలియమ్సన్ వంటి అనుభవశాలిని పెట్టుకుని శుభమన్ గిల్ లేదా రషీద్ ఖాన్‌కు పగ్గాలు అప్పజెప్పుతుందా అనేది సందేహమే. శుభమన్ గిల్ అద్భుతంగా రాణిస్తున్నా అతనికి ఏ దశలోనూ కెప్టెన్సీ అనుభవం లేదు. కానీ ఫాలోయింగ్ పరంగా చూస్తే శుభమన్ గిల్‌కు మంచి క్రేజ్ ఉంది. అయితే స్థానికత, బ్యాటింగ్ సామర్ధ్యం, క్రేజ్ దృష్టిలో ఉంచుకుని శుభమన్ గిల్ పేరునే ఖాయం చేసింది.  

గుజరాత్ టైటాన్స్ జట్టులో ప్రస్తుతం 17 మంది ఉంటే అందులో 6 మంది విదేశీయులు కాగా 11 మంది స్వదేశీయులున్నారు. జీటీ పర్సులో మిగిలిన డబ్బులు 13 కోట్లే.  గుజరాత్ టైటాన్స్ రిలీజ్ చేసిన ఆటగాళ్లలో యశ్ దయాల్, కేఎస్ భరత్, శివమ్ మావి, ఉర్విల్ పటేల్, ప్రదీప్ సాంగ్వాన్, ఓడియన్ స్మిత్, అల్జరీ జోసెఫ్, దనుష్ శనక ఉన్నారు. 

ఇక గుజరాత్ టైటాన్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో డేవిస్ మిల్లర్, శుభమన్ గిల్, మాధ్యూవేడ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, అబినవ్ మనోహర్, సాయి సుదర్శన్, దర్శన్ సల్కండే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాటియా, మొహమ్మద్ షమీ, నూర్ అహ్మద్, సాయి కిషోర్, రషీద్ ఖాన్, జాషువ లిటిల్, మోహిత్ శర్మ ఉన్నారు. 

Also read: IPL 2024 Purse Details: ముగిసిన రిటెన్షన్ ప్రక్రియ, ఏ జట్టు పర్సులో ఎంత ఉందో తెలుసా. టాప్ 2 జట్లు ఏవంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News