Deepak Chahar, Mohammed Shami will take most wickets in GT vs CSK match: మరికొన్ని గంటల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2023 ప్రారంభ వేడుకలకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం సర్వం సిద్ధమైంది. 16వ సీజన్ తొలి మ్యాచ్ డిపెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లలో స్టార్ బౌలర్లు ఉన్నారు. వారు ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించేందుకు సిద్ధం అవుతున్నారు. ఆ బౌర్లు ఎవరో చూద్దాం.
దీపక్ చహర్:
టీమిండియా స్వింగ్ పేసర్ దీపక్ చహర్ ఐపీఎల్ 2023 సీజన్ తొలి మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. గతేడాది గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమైన దీపక్.. ఈసారి రెట్టించిన ఉత్సాహంతో ఉన్నాడు. తన స్వింగ్ బంతులతో బ్యాటర్లను ఔట్ చేయడంలో సిద్ధహస్తుడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే కీలక వికెట్స్ పడగొట్టడం దీపక్ ప్రత్యేకత. కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా చహర్‌ను చక్కగా వాడుకుంటాడు. ఇప్పటివరకు ఐపీఎల్లో 59 వికెట్లు తీసిన చహర్.. తన పునరాగమనాన్ని ఘనంగా చాటాలని చూస్తున్నాడు.
మహమ్మద్ షమీ:
టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ కూడా వికెట్ల దాహంతో ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2023 ట్రోఫీ నెగ్గడంలో షమీ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. 16 మ్యాచుల్లో 20 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఇటీవలి దేశవాళీల్లో కూడా రాణించాడు. ఈప్రస్తుతం మంచి ఫామ్ కనబర్చుతున్న షమీ.. ఈసారి కూడా గుజరాత్ విజయాల్లో కీలకం కానున్నాడు. చెన్నై బ్యాటర్లకు తిప్పలు తప్పవు అని చెప్పొచ్చు. సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు వేస్తూ.. పవర్‌ప్లే, డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడం షమీ ప్రత్యేకత.
రషీద్ ఖాన్:
టీ20 ఫార్మాట్‌లో ప్రపంచంలోని బెస్ట్ బౌలర్లలో ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఒకడు. అద్భుత బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను పెవిలియన్ చేర్చడం మనోడి ప్రత్యేకత. స్టార్ బ్యాటర్లు సైతం రషీద్ బౌలింగ్లో ఆచితూచి ఆడుతారు. మిడిల్ ఓవర్లలో వికెట్స్ తీయడం, పరుగులు కట్టడి చేయడం ఆఫ్ఘన్ స్పిన్నర్ స్పెషాలిటీ. ఇప్పటివరకు 92 ఐపీఎల్ మ్యాచుల్లో 112 వికెట్లు తీసుకున్నాడు. ఇటీవల మంచి ఫామ్ లో ఉన్న రషీద్.. నేటి మ్యాచ్‌లో కూడా చెలరేగే అవకాశం ఉంది.
Also Read: GT vs CSK IPL 2023: బిల్డప్ బాబాయ్ వచ్చేశాడు.. ఇక ఐపీఎల్ 2023 తొలి మ్యాచ్ జరగడం కష్టమే!
Also Read: IPL 2023 Winnner: ఐపీఎల్ 2023 టైటిల్ గెలిచేది ఆ జట్టే.. మాజీ దిగ్గజం జోస్యం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.