GT vs MI Qualifier 2 Dream11: గుజరాత్-ముంబై మధ్య లాస్ట్‌ ఫైట్..డ్రీమ్11 టీమ్ ఇదే!

GT vs MI IPL 2023 Qualifier 2 Dream11 Team Prediction. ఐపీఎల్ 2023 క్వాలిఫయర్ 2లో గుజరాత్ టైటాన్స్‌, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. గుజరాత్-ముంబై డ్రీమ్11 టీమ్ ఇదే.  

Written by - P Sampath Kumar | Last Updated : May 26, 2023, 10:24 AM IST
GT vs MI Qualifier 2 Dream11: గుజరాత్-ముంబై మధ్య లాస్ట్‌ ఫైట్..డ్రీమ్11 టీమ్ ఇదే!

GT vs MI IPL 2023 Qualifier 2 Dream11 Team: ఐపీఎల్ 2023 తుది అంకానికి చేరింది. ప్రస్తుతం క్వాలిఫయర్ మ్యాచులు జరుగుతున్నాయి. క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించగా.. గుజరాత్ టైటాన్స్‌ ఓడింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను ముంబై ఇండియన్స్ ఓడించింది. ఇక రెండో ఫైనల్ బెర్త్ కోసం జరిగే క్వాలిఫయర్ 2లో గుజరాత్ టైటాన్స్‌, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. అహ్మదాబా‌ద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో శుక్రవారం రాత్రి ఈ మ్యాచ్ జరగనుంది. జియో సినిమా, స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ఈ మ్యాచ్ లైవ్ చూడొచ్చు. 

ముంబై ఇండియన్స్ జట్టు వరుస విజయాలతో మంచి ఫామ్ మీదుంది. ముంబై బ్యాటర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, కామెరాన్ గ్రీన్, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా పరుగుల వరద పారిస్తున్నారు. ఇక సూర్య, గ్రీన్ అయితే చెలరేగి ఆడుతున్నారు. బౌలర్లు కూడా ఫేమ్ అందుకున్నారు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆకాశ్‌ మధ్వాల్‌ ఏకంగా 5 వికెట్స్ పడగొట్టాడు. క్వాలిఫయర్ 2లో సమిష్టిగా రాణిస్తే ముంబైకి విజయం పెద్ద కష్టమేమి కాదు. 

ఐపీఎల్ 2023 లీగ్ దశలో గుజరాత్ టైటాన్స్ చెలరేగి ఆడింది. ఏకంగా 10 విజయాలతో టేబుల్ టాపర్ గా నిలిచింది. అయితే కీలక క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో మాత్రం చేతులెత్తేసింది. చెన్నై నిర్ధేశించిన మోస్తరు స్కోరును ఛేదించలేక చతికిల పడింది. శుభమాన్ గిల్ మినహా వృద్ధిమాన్ సాహా, దాసున్ షనక, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్ విఫలమవడంతో గుజరాత్ జట్టుకు ఓటమి తప్పలేదు. అయితే గుజరాత్ బౌలర్లు రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, మోహిత్ శర్మ వికెట్స్ తీస్తుండడం కలిసొచ్చే అంశం. 

తుది జట్లు (అంచనా) (GT vs MI Playing 11):
గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా, శుభమాన్ గిల్, దసున్ షనక, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ, మోహిత్ శర్మ, దర్శన్ నల్కండే. 
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, నేహాల్ వధేరా, కామెరాన్ గ్రీన్, టిమ్ డేవిడ్, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, హృతిక్ షోకీన్, ఆకాష్ మధ్వల్. 

డ్రీమ్11 టీమ్ (MI vs GT Dream11 Team):
కీపర్ - ఇషాన్ కిషన్
బ్యాట్స్‌మెన్ - శుభమన్ గిల్ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ
ఆల్ రౌండర్లు - కామెరాన్ గ్రీన్ (వైస్ కెప్టెన్), హార్దిక్ పాండ్యా
బౌలర్లు - మహ్మద్ షమీ, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, పీయూష్ చావ్లా, ఆకాష్ మధ్వల్. 

Also Read: GT vs MI Qualifier 2 Playing 11: ఫైనల్ బెర్త్ కోసం గుజరాత్-ముంబై ఫైట్.. తుది జట్లు ఇవే!  

Also Read: Xiaomi 14 Pro Launch Date: సంచలనం సృష్టించడానికి వస్తున్న షియోమీ స్మార్ట్‌ఫోన్.. 5000 బ్యాటరీ!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook.

Trending News