CSK Coach Stephen Fleming react on MS Dhoni Fitness: శుక్రవారం రాత్రి అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలైంది. 179 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శుబ్‌మన్ గిల్ (63) హాఫ్ సెంచరీ చేశాడు. చివరలో వైస్ కెప్టెన్ రషీద్ ఖాన్ 3 బంతుల్లో 10 పరుగులు చేసి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ విజయంతో గుజరాత్ ఐపీఎల్ 16 సీజన్లో బోణి కొట్టింది. మరోవైపు 16వ సీజన్‌ను చెన్నై ఓటమితో ప్రారంభించింది.
ఈ మ్యాచ్‌లో గుజరాత్‌పై 7 బంతుల్లో 14 పరుగులు చేసిన ఎంఎస్ ధోనీ నాటౌట్‌గా నిలిచాడు. బ్యాటింగ్‌లో తనదైన శైలిలో భారీ షాట్లు కొట్టి అభిమానులను అలరించాడు . అయితే కీపింగ్‌లో మాత్రం దూకుడుగా లేడు. గుజరాత్ ఇన్నింగ్స్‌లోని దీపక్ చహర్ వేసిన 19వ ఓవర్‌లో రాహుల్ తెవాతియా ప్యాడ్లను తాకి లెగ్ సైడ్‌కు వెళ్తున్న బంతిని ఆపడంలో మహీ విఫలమయ్యాడు.అంతేకాదు ధోని కండరాలు పట్టేశాయి. త్వరగానే సర్దుకున్న ధోనీ.. కీపింగ్ బాధ్యతలను పూర్తి చేశాడు. దాంతో ధోనీలో మునుపటి వేగం లోపించిందని నెట్టింట వార్తలు వినిపించాయి. వీటిపై సీఎస్‌కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు. 15 ఏళ్ల కిందట ఉన్న దూకుడు ఇప్పుడు ఉండదు కదా అని పేర్కొన్నాడు.
మ్యాచ్ అనంతరం స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ... 'ఎంఎస్ ధోనీ నిరంతరం ఆడుతూనే ఉంటాడు. అయితే మహీలో వేగం లేదనే వార్తలు ఎక్కడ నుంచి వస్తున్నాయో అర్థం కావడం లేదు. ఐపీఎల్ 2023 ప్రారంభానికి ముందు వరకు మోకాలి నొప్పితో బాధపడ్డాడు. ఈ మ్యాచ్‌లో కాలు తిమ్మిరి ఎక్కింది. మోకాలు నొప్పి కాదు. ధోనీ 15 ఏళ్ల కిందట ఎంత వేగంగా ఉన్నాడో ఇప్పుడు అలా ఉండలేడు. అయితే ఇప్పటికీ ధోనీ గొప్ప కెప్టెన్. బ్యాటింగ్‌లోనూ తనదైన దూకుడు ప్రదర్శించాడు. తన పరిస్థితిపై ధోనీకి పూర్తి అవగాహన ఉంది. మైదానంలో అతడు చాలా కీలకమైన ఆటగాడు. ధోనీ ఓ దిగ్గజ క్రికెటర్. కాదంటారా' చెప్పండి' అని ఫ్లెమింగ్ వ్యాఖ్యానించాడు.
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంస్ ధోనీ ఐపీఎల్‌లో అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో చరిత్రలోనే అత్యంత పెద్ద వయస్కుడైన సారథిగా మహీ నిలిచాడు. ఐపీఎల్ 2023లో భాగంగా శుక్రవారం రాత్రి గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో చెన్నై సారథిగా బరిలోకి దిగిన మహీ ఈ అరుదైన ఫీట్ సాధించాడు. ధోనీ 41 ఏళ్ల 267 రోజుల వయస్సులో ఈ ఘనత అందుకున్నాడు.
Also Read: Janhvi Kapoor Pics: సాగర తీరాన బికినీలో జాన్వీ కపూర్.. ఇంత అందంగా ఉంటే పోవా కుర్రకారు మతులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.