SRH vs RCB Dream11 Prediction: హైదరాబాద్‌తో బెంగళూరు కీలక మ్యాచ్.. డ్రీమ్11 టీమ్ ఇదే! కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్

IPL 2023 SRH vs RCB Dream11 Prediction Today Match. ఐపీఎల్ 2023లో భాగంగా నేడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : May 18, 2023, 12:06 PM IST
SRH vs RCB Dream11 Prediction: హైదరాబాద్‌తో బెంగళూరు కీలక మ్యాచ్.. డ్రీమ్11 టీమ్ ఇదే! కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్

IPL 2023 SRH vs RCB Dream11 Prediction Today Match: ఐపీఎల్ 2023లో భాగంగా నేడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో గురువారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. సొంతగడ్డపై ఆడనున్న సన్‌రైజర్స్‌ కథ ఇప్పటికే ముగిసింది. పేలవ ప్రదర్శనతో ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. అయితే రెండు మ్యాచ్‌లు ఆడనున్న సన్‌రైజర్స్‌.. మిగతా జట్ల అవకాశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. 

మొదటి మ్యాచులో సొంతగడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఢీకొననుంది. ఐపీఎల్ 2023లో 12 మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు.. 6 విజయాలు, 6 ఓటములను ఎదుర్కొంది. దాంతో బెంగళూరుకు ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం తప్పనిసరి అయింది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఓడినా.. రేసులో ఉంటుంది. కానీ చివరి మ్యాచ్‌లో (గుజరాత్‌ టైటాన్స్‌) గెలవడంతో పాటు మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. అందుకే నేడు సన్‌రైజర్స్‌పై గెలవాలని చూస్తోంది. 

ఈ మ్యాచ్‌లో గెలుపు కోసం బెంగళూరు సర్వశక్తులు ఒడ్డుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫాఫ్ డుప్లెసిస్‌, విరాట్‌ కోహ్లీ, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ఫామ్‌లో ఉండటం సానుకూలాంశం. ముఖ్యంగా మ్యాక్స్‌వెల్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో అదరగొడుతున్నాడు. మిడిలార్డర్‌ కూడా గాడిన పడితే బెంగళూరుకు తిరుగుండదు. బౌలర్లు పార్నెల్‌, సిరాజ్‌, బ్రాస్‌వెల్‌, కర్ణ్‌ శర్మ సమష్టిగా రాణిస్తున్నారు. మరోవైపు ఏమాత్రం పోటీ ఇవ్వని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఈ మ్యాచ్‌లో ఎలా ఆడుతుందో చూడాలి. 

తుది జట్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి/అన్మోల్‌ప్రీత్ సింగ ఐడెన్ మార్క్‌రమ్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, సన్వీర్ సింగ్, మార్కో జాన్సెన్, మయాంక్ మార్కండే, ఫజల్ హక్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్,  దినేష్ కార్తీక్, మైకేల్ బ్రేస్‌వెల్, అనుజ్ రావత్, వేన్ పార్నెల్, కర్ణ్ శర్మ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్. 

డ్రీమ్11 టీమ్:
కీపర్ - హెన్రిచ్ క్లాసెన్, అనుజ్ రావత్
బ్యాట్స్‌మెన్ - విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్)
ఆల్ రౌండర్లు - గ్లెన్ మాక్స్‌వెల్ (వైస్ కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, ఐడెన్ మార్క్‌రమ్, మార్కో జాన్సెన్
బౌలర్లు - వేన్ పార్నెల్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్

Also Read: XUV400 Vs Nexon EV: టాటా నెక్సాన్ ఈవీ vs మహీంద్రా ఎక్స్‌యూవీ400.. బ్యాటరీ, రేంజ్ వివరాలు ఇవే!

Also Read: Maruti Baleno Price 2023: ఆల్టో ధరలో బాలెనోను ఇంటికి తీసుకెళ్లండి.. మీకు చాలా డబ్బు ఆదా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

Trending News