IPL 2022: పంజాబ్ కింగ్స్​ కొత్త​ కెప్టెన్​గా మయాంక్​ అగర్వాల్

Mayank Agarwal: భారత బ్యాటర్​ మయాంక్ అగర్వాల్​ను ​కెప్టెన్​గా నియమించింది పంజాబ్​ కింగ్స్​.​ తనని సారథి చేయడంపై మయాంక్ హర్షం వ్యక్తం చేశాడు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 28, 2022, 01:03 PM IST
  • పంజాబ్ కొత్త నాయకుడిగా మయాంక్
  • అధికారికంగా ప్రకటించిన టీమ్ మేనేజ్‌మెంట్‌
IPL 2022: పంజాబ్ కింగ్స్​ కొత్త​ కెప్టెన్​గా మయాంక్​ అగర్వాల్

Punjab kings new Captain Mayank Agarwal: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 సీజన్‌కు తమ కొత్త కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్‌ను (Mayank Agarwal) పంజాబ్ కింగ్స్ సోమవారం ప్రకటించింది. ఐపీఎల్ 2022 (IPL 2022) మెగా వేలానికి ముందు పంజాబ్ కింగ్స్ (Punjab kings) రిటైన్ చేసిన ఇద్దరు ఆటగాళ్లలో మయాంక్ ఒకరు. మార్చి 26 నుంచి ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభమవుతోంది. ఈ సారి 10 జట్లు పాల్గొంటున్నాయి. తనను కెప్టెన్ చేయడంపై మయాంక్ హర్షం వ్యక్తం చేశాడు.

"నేను 2018 నుండి పంజాబ్ కింగ్స్‌లో ఉన్నాను. ఇప్పడు జట్టుకు నాయకత్వం వహించే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. నా బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తా.  మా జట్టులో మంది అనుభవజ్ఞులైన ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. వారితోపాటు చాలా మంది ప్రతిభావంతులైన యువకులు ఉన్నారు. వీరి అండతో తొలి ఐపీఎల్ టైటిల్ గెలిచేందుకు కృషి చేస్తాం. ఈ కొత్త బాధ్యతను అప్పగించినందుకు టీమ్ మేనేజ్‌మెంట్‌కి ధన్యవాదాలు''.అంటూ మయాంక్ చెప్పుకొచ్చాడు.

2011లో ఐపీఎల్​లో (IPL) అడుగుపెట్టాడు మయాంక్.  100కు పైగా మ్యాచులు ఆడాడు. భారత్​ తరఫున 19 టెస్టులు, 5 వన్డేలు ఆడాడు. ఈ సారి ఐపీఎల్ మెగా వేలంలో శిఖర్​ ధావన్​, జానీ బెయిర్​స్టో, లియామ్​ లింవింగ్​స్టోన్​, కగిసో రబడ, హర్​ప్రీత్​ బ్రార్​, సందీప్ శర్మ, రాహుల్ చహార్,  షారుక్​ ఖాన్ వంటి ఆటగాళ్లను కొనుగోలు చేసింద. 

Also Read: IND vs SL 3rd T20: మెరుపు ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్...లంకను క్లీన్​స్వీప్​ చేసిన టీమిండియా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

 

Trending News