దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది హాన్సీ క్రోన్జే, హెర్షల్ గిబ్స్, గ్రేమ్ స్మిత్, ఏబీ డివిలియర్స్, జాకస్ కలిస్, జాంటీ రోడ్స్ పేర్లు గుర్తుకొస్తాయి. నైపుణ్యం ఉన్నా అంతగా గుర్తింపు దక్కని ఓ గొప్ప బ్యాట్స్‌మెన్ దక్షిణాఫ్రికాలో ఉన్నాడు. అతడు మరెవరో కాదు జాక్వెస్ రుడాల్ఫ్. నేడు (మే 4న) అతడి పుట్టినరోజు. టాలెంటెడ్ క్రికెటర్ అయినా, ఫామ్ కోల్పోవడంతో గుర్తింపు దక్కుకుండానే రిటైర్ అయ్యాడు. 24వ అంతస్తు నుంచి దూకేస్తానని భయపడ్డారు: మహ్మద్ షమీ
అతడి స్పెషాలిటీ ఏంటంటే.. అరంగేట్రం చేసిన టెస్టులోనే డబుల్ సెంచరీ సాధించి అద్భుతమైన ఆరంభం చేశాడు. అతను 2003 ఏప్రిల్ 24 న టెస్ట్ క్రికెట్లో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో యువ క్రికెటర్ జాకస్ రుడాల్ఫ్ 222 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తొలి టెస్టు మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసిన చివరి బ్యాట్స్‌మెన్‌గానూ నిలిచాడు. ఆ ఫీట్ సాధించిన ఏకైక సఫారీ క్రికెటర్ జాక్వస్ రుడాల్ఫ్ కావడం విశేషం. బద్ధకస్తుడన్నారు.. హిట్ మ్యాన్‌గా రోహిత్ ఇలా మారాడు!
ఓవరాల్‌గా టెస్ట్ క్రికెట్లో ఈ ఫీట్ సాధించిన 5వ బ్యాట్స్‌మెన్ రుడాల్ఫ్. గతంలో నలుగురు ఆటగాళ్లు తొలి టెస్టులో ద్విశతకం బాదారు. ఇంగ్లండ్‌కు చెందిన రెజినాల్డ్ ఫోస్టర్ (287), వెస్టిండీస్ క్రికెటర్ లారెన్స్ రోవ్ (217), శ్రీలంకకు చెందిన బ్రెండన్ కెరుప్పు (201 నాటౌట్), న్యూజిలాండ్‌కు చెందిన మాథ్యూ సింక్లైర్ (214)లు తొలి టెస్టులోనే డబుల్ సెంచరీ సాధించగా.. వీరి సరసన రుడాల్ఫా చేరాడు. బికినీలో బ్యూటీలు.. సమ్మర్ మరింత హాట్!
అరంగేట్ర తర్వాత మూడేళ్లు మ్యాచ్‌లాడినా కేవలం 4 శతకాలు మాత్రమే చేశాడు. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌లో 6 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 125 రన్స్ చేసి దారుణంగా విఫలమయ్యాడు. దీంతో జట్టులో చోటు కోల్పోయిన రుడాల్ఫ్ జనవరి 2007లో యార్క్‌షైర్‌కు వెళ్లాడు, 2010లో దక్షిణాఫ్రికాకు తిరిగొచ్చి సూపర్‌స్పోర్ట్ సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. లాక్డౌన్లో మిల్కీ ‘బ్యూటీ’ Photos
ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన 2011–12 టెస్ట్ సిరీస్ కోసం ప్రోటీస్ జట్టులోకి వచ్చాడు. కానీ నవంబర్ 2012లో రిటైరయ్యాడు. కౌంటీ క్రికెట్ ఆడటానికి ఇంగ్లాండ్ వెళ్లాడు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Photos: కేఎల్ రాహుల్, అతియా శెట్టి క్రేజీగా!