close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

తన సక్సెస్ సీక్రెట్ లీక్ చేసిన విరాట్ కోహ్లీ !!

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన అభిమానులకు ఫిటెనెస్ వల్ల కలిగే ప్రయోజనం గురించి వివరిస్తున్నాడు.

Updated: Jul 19, 2019, 04:18 PM IST
తన సక్సెస్ సీక్రెట్ లీక్ చేసిన విరాట్ కోహ్లీ !!

ప్రస్తుతం భారత క్రికెట్ టీంలో మోస్ట్ సక్సెస్ ఫుల్ మ్యాన్ ఎవరంటే ..ఎవరైనా ఠక్కున చెప్పే పేరు ఒకటే అతడే విరాట్ కోహ్లీ.. టీమిండియాలో అంత్యంత ఫిట్ నెస్ కలిగిన వ్యక్తి ఎవరని అడిగినా వెంటనే వినబడే పేరు విరాట్ కోహ్లీ. విరాట్ నిరంతర సక్సెస్ కు అతని ఫిట్ నెస్ కు ఏంటి సంబంధం ఏంటి అనుకుంటున్నారా..? ... ఈ  ప్రశ్న విరాట్ కోహ్లీని  అడిగితే అతను ఏమన్నాడంటే..  ఫిటెనెసే తన సక్సెస్ సీక్రెట్  అంటూ రెండిటిని జోడించి మాట్లాడుతున్నాడు.

విండిస్ పర్యటన  కోసం ఫిట్ గా ఉండేందుకు తాను ఎక్సర్ సైజు చేస్తున్న వీడియోను విరాట్ కోహ్లీ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. వ్యాయామంలో భాగంగా వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్న వీడియోను కోహ్లీ సరదాగా తన అభిమానులతో పంచుకున్నాడు. దానికి ‘కష్టపడటానికి మరో ప్రత్యామ్నాయం లేదు’ అని ట్యాగ్ ను జతచేశాడు. ఈ వీడియోను నెటిజన్లు విపరీతంగా షేర్ చేస్తున్నారు..

 

 

చాలా మంది క్రికెటర్ల మారిదిలా కాకుండా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటికీ విరాట్ ఒత్తిడిని తట్టుకుంటూ బ్యాట్ తోనూ రాణిస్తూనే ఉన్నాడు. దీని కారణం తన ఫిటెనెస్ ఒక్కటే అని కోహ్లీ గట్టిగా వాదిస్తున్నాడు. టీమిండియా సారథి  వాదనతో ఏకీభవిస్తున్నట్లయితే మీ ఫిట్ నెస్ ను నిరూపించుకోని సక్సెస్ కు బాటలు వేసుకోండి మరి..